దుబాయ్‌లో సూర్యకుమార్ భారీ పెట్టుబడి.. షారుఖ్ ఖాన్ ప్రాపర్టీలో లగ్జరీ ఇల్లు కొనుగోలు!
- షారుఖ్ ఖాన్ పేరుతో నిర్మించిన 'షారుఖ్జ్ రెసిడెన్సెస్'లో ఈ ప్రాపర్టీ
- భార్య దేవిషాతో కలిసి వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సూర్య
- దుబాయ్‌లోని భద్రత, జీవన ప్రమాణాలపై సూర్యకుమార్ ప్రశంసలు
- ఇటీవలే ముంబైలో రూ.7 కోట్లకు పైగా విలువైన ఫ్లాట్ కొన్న అతని అర్ధాంగి
టీమిండియాకు 2026 టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లో విలాసవంతమైన నివాసాన్ని కొనుగోలు చేశాడు. తన భార్య దేవిషా శెట్టితో కలిసి ఉన్న ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పేరుతో నిర్మించిన 'షారుఖ్జ్ రెసిడెన్సెస్' అనే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలో సూర్య ఈ ఇంటిని కొన్నాడు.
ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ.. "నేను మొదటిసారి 2014లో ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ వచ్చాను. ఆ తర్వాత 2020లో కూడా వచ్చాను. ఇప్పుడు చూస్తే, యావత్ భారతదేశం దుబాయ్ వస్తోంది. ఇక్కడ లగ్జరీ, జీవన ప్రమాణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముంబైలో నేను నివసించే చోట భద్రత ఉంది, కానీ దుబాయ్‌లోని భద్రత కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా రిలాక్స్డ్గా, సంతోషంగా అనిపిస్తుంది" అని వివరించాడు.
షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కొనడంపై ప్రత్యేకంగా స్పందించాడు. "షారుఖ్ సర్ పేరుతో ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారని వినగానే, మరో ఆలోచన రాలేదు. ఇందులో ఇంటీరియర్ వర్క్, క్వాలిలిటీ అద్భుతంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా లాంజెవిటీ, వెల్నెస్ సెంటర్ ఉండటం నాకు బాగా నచ్చింది" అని సూర్యకుమార్ తెలిపాడు.
ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో హైపర్బారిక్ ట్రీట్మెంట్, రెడ్ లైట్ థెరపీ, క్రయోథెరపీ వంటి అత్యాధునిక ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని ఆ వీడియోలో పేర్కొన్నాడు. "ఇక్కడ మరో విషయం గమనించాను. రక్త పరీక్ష లేకుండానే శరీరంలోని షుగర్ లెవెల్స్ నుంచి ఏ టు జెడ్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇది చాలా అద్భుతం" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో సూర్యకుమార్ భార్య దేవిషా ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రూ. 7.18 కోట్లతో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గోద్రెజ్ స్కై టెర్రసెస్ భవనంలో వారు కొన్న మూడో అపార్ట్మెంట్ ఇది.
ఒకవైపు ఆస్తుల కొనుగోలుతో సూర్యకుమార్ వార్తల్లో నిలుస్తుండగా, మరోవైపు అతని కెరీర్ ఆసక్తికరంగా మారింది. 2026లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ, ప్రస్తుతం సూర్య పొట్టి ఫార్మాట్ జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడం అప్పట్లో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.