ఆఫీస్‌కు కారులో కాదు, గాల్లో ప్రయాణం.. అమెరికా ఉద్యోగి వినూత్న ఆలోచన!
- అమెరికాలో పారామోటార్పై ఆఫీస్‌కి వెళుతున్న ఉద్యోగి
- కొలరాడోకు చెందిన 28 ఏళ్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జాకబ్ హట్లర్ వినూత్న పంథా
- కారులో కాకుండా గాల్లో 20 నిమిషాల ప్రయాణం
- సమయం ఆదా కోసం కాదు, ఆనందం కోసమేనంటున్న జాకబ్
- అధికారుల అనుమతి, కంట్రోల్ టవర్ సమన్వయంతోనే ప్రయాణం
ఉదయం ఆఫీస్‌కు వెళ్లాలంటే చాలామందికి ట్రాఫిక్ జామ్‌లే గుర్తుకొస్తాయి. కారులోనో, బైక్‌పై వెళ్లినా గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. కానీ, అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం ఈ ట్రాఫిక్ గందరగోళంతో సంబంధం లేకుండా నేరుగా గాల్లోంచి తన ఆఫీస్‌కు చేరుకుంటున్నాడు. విమానంలో కాదు, తన వీపునకు కట్టుకున్న ఓ చిన్న మోటార్ సాయంతో ఆయన చేసే ఈ ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం ప్యూబ్లో నగరానికి చెందిన 28 ఏళ్ల జాకబ్ హట్లర్ వృత్తిరీత్యా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఆయన తన ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు ఎంచుకున్న మార్గం అందరి కంటే భిన్నం. రోజూ తన అపార్ట్మెంట్ బయట ఉన్న రోడ్డుపై పారాగ్లైడర్ రెక్కను పరిచి, దానికి అమర్చిన మోటరైజ్డ్ ప్రొపెల్లర్ బ్యాక్‌ప్యాక్‌ను (పారామోటార్) స్టార్ట్ చేస్తాడు.
కొద్ది దూరం పరుగెత్తి గాల్లోకి లేచి, పొలాలు, హైవే మీదుగా సుమారు 20 నిమిషాల పాటు ప్రయాణిస్తాడు. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, తను పనిచేసే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అవుతాడు. చిన్నప్పటి నుంచి విమానాలంటే ఇష్టం ఉన్న జాకబ్‌కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఆయన తన పై అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు.
గాల్లోకి లేచినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్‌తో నిరంతరం టూ-వే కమ్యూనికేషన్లో ఉంటాడు. ఎందుకంటే, రాడార్లకు ఈ చిన్న పరికరం కనిపించే అవకాశం తక్కువ. వాతావరణం అనుకూలించినప్పుడు, గత జూన్ నుంచి వారానికి ఒకసారి ఇలాగే ఆఫీస్‌కు వెళుతున్నాడు.
ఈ ప్రయాణానికి సిద్ధమవ్వడానికి పట్టే సమయాన్ని కూడా కలిపితే, కారులో వెళ్లడం కంటే వేగమేమీ కాదని జాకబ్ చెబుతున్నాడు. "సమయం ఆదా కోసం కాదు, ఈ ప్రయాణంలో లభించే స్వేచ్ఛ, గాల్లోంచి కనిపించే దృశ్యాలు, నచ్చిన సంగీతం వింటూ ప్రయాణించడం కోసం ఇలా వెళుతున్నాను" అని ఆయన వివరించారు.
ఇటీవల తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. నెటిజన్లు 'ఏరియల్ ట్రాఫిక్', 'ఇంధన ఖర్చులు' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.