'తిరంగా యాత్ర'కు పిలుపు.. కాక్రోచ్ పార్టీ నేత ఇంటికి వెళ్లిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తిరంగా యాత్ర'కు పిలుపు.. కాక్రోచ్ పార్టీ నేత ఇంటికి వెళ్లిన పోలీసులు

Delhi police visit Cockroach Party leader home after Tiranga Yatra call
  • 'తిరంగా యాత్ర'కు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత
  • అభిజీత్ దీప్కే ఇంటికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు
  • పోలీసుల సందేశాన్ని, పత్రాలను పరిశీలిస్తూ ప్రశ్నించిన దీప్కే
  • 'నాపై ఏం ఆరోపణలు మోపారు?' అంటూ పోలీసులతో వాగ్వాదం
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
'తిరంగా యాత్ర' చేపట్టి జాతీయ జెండాను ఎగురవేయవద్దని సూచించేందుకు ఢిల్లీ పోలీసులు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, దీప్కేకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అక్టోబర్ 16న కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రజలందరూ తరలిరావాలని బుధవారం అభిజిత్ దీప్కే పిలుపునివ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ పిలుపుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు, సదరు కార్యక్రమాన్ని నిలువరించే ఉద్దేశంతో న్యూఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు అందజేసిన పత్రాలను పరిశీలిస్తూ, అభిజీత్ దీప్కే వారిని సూటిగా ప్రశ్నించారు. భుజాలపై త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని సోఫాలో కూర్చున్న ఆయన, ఎదురుగా ఉన్న పోలీసు అధికారిని ఉద్దేశించి "క్యా ఆరోప్ లగా దియా హై ఆప్నే మేరే పర్? (నాపై మీరు ఏ ఆరోపణలు మోపారు?)" అని హిందీలో నిలదీయడం వీడియోలో రికార్డయింది.

పోలీసులు తీసుకువచ్చిన పత్రాలను టేబుల్‌పై ఉంచి, వాటిలోని అంశాలను చదువుతూ ఆయన పోలీసులను ఎదురు ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిస్తే, తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన నిలదీశారు.
Advertisement
Abhijit Dipke
Tiranga Yatra
Cockroach Janata Party
Delhi Police
Connaught Place
National Flag Hoisting

More Telugu News