8 డాలర్లతో హైదరాబాద్ విడిచి కెనడా వెళ్లారు.. ఇప్పుడు రూ.52 వేల కోట్లతో ఐడీబీఐ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తున్నారు!
- 1972లో కేవలం 8 డాలర్లతో కెనడాకు వెళ్లిన హైదరాబాద్ వాసి ప్రేమ్ వత్సా
- ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరింగ్.. కెనడాలో ఎంబీఏ పూర్తి
- ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్‌ను అంతర్జాతీయ బీమా, పెట్టుబడుల సంస్థగా తీర్చిదిద్దిన ప్రేమ్
- ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను రూ.52,878 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రతిపాదన
- ఈ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.. లావాదేవీ పూర్తయితే తగ్గనున్న కేంద్రం, ఎల్ఐసీ వాటాలు
1972లో జేబులో కేవలం 8 డాలర్లతో భారత్ నుంచి కెనడాకు వెళ్లిన వ్యక్తి.. ఇప్పుడు రూ.వేల కోట్ల పెట్టుబడితో భారత బ్యాంకింగ్ రంగంలో కీలక ఒప్పందానికి సిద్ధమయ్యారు. ఆయనే హైదరాబాద్‌లో పుట్టి, కెనడాలో బిలియనీర్‌గా ఎదిగిన ప్రేమ్ వత్సా. ఆయన నేతృత్వంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ.. ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను రూ.52,878 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇదొకటి. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న వాటాలను తగ్గించుకొని, ప్రైవేటు పెట్టుబడిదారుడికి నిర్వహణ నియంత్రణ అప్పగించే ప్రక్రియలో ఇదొక కీలక అడుగు. అయితే ఈ లావాదేవీకి ఇంకా అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి కెనడాకు ప్రయాణం
ప్రేమ్ వత్సా 1950లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువుల కోసం 1972లో కెనడాకు వెళ్లారు. అప్పటికి ఆయన వయసు 22 ఏళ్లు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఓంటారియోలో ఎంబీఏ చదువుతూ ఖర్చుల కోసం ఇంటింటికీ తిరిగి ఎయిర్ కండిషనర్లు, ఫర్నేస్‌లు విక్రయించారు.
1974లో కెనడాకు చెందిన కాన్ఫెడరేషన్ లైఫ్ అనే బీమా సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడే పెట్టుబడుల రంగంపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ పెట్టుబడిదారుడు బెంజమిన్ గ్రాహం అనుసరించిన ‘వాల్యూ ఇన్వెస్టింగ్’ విధానం ఆయనపై ప్రభావం చూపింది. అంటే మార్కెట్లో తక్కువ విలువకు లభిస్తున్నా, అంతర్గతంగా మంచి విలువ ఉన్న వ్యాపారాలను గుర్తించి దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం.
ఫెయిర్‌ఫ్యాక్స్ సామ్రాజ్యం ఎలా ఎదిగింది?
1984లో హాంబ్లిన్ వాట్సా ఇన్వెస్ట్మెంట్ కౌన్సెల్‌ను సహవ్యవస్థాపకుడిగా ప్రారంభించారు. 1985లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మార్కెల్ ఫైనాన్షియల్ అనే బీమా సంస్థను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారుల బృందాన్ని సమీకరించారు. ఆ సంస్థే తర్వాత ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌గా రూపాంతరం చెందింది. 1985 నుంచి ఆ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
నేడు ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రపంచవ్యాప్తంగా బీమా, రీ-ఇన్సూరెన్స్, పెట్టుబడుల వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బీమా సంస్థలకు ప్రీమియంల రూపంలో ముందుగానే డబ్బు అందుతుంది. క్లెయిమ్‌ల కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని పక్కనపెట్టి, నిబంధనలకు అనుగుణంగా మిగిలిన నిధులను పెట్టుబడులకు వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ఫెయిర్‌ఫ్యాక్స్‌కు పెట్టుబడుల కోసం మూలధనాన్ని సమకూరుస్తోంది.
దీర్ఘకాలిక పెట్టుబడులు, బీమా వ్యాపారం ద్వారా సమకూరే నిధులను ఉపయోగించడంలో ఆయన అనుసరించే విధానం అమెరికా బిలియనీర్ వారెన్ బఫెట్ వ్యూహాన్ని పోలి ఉంటుంది. అందుకే ప్రేమ్ వత్సాను ‘కెనడా వారెన్ బఫెట్’ అని పిలుస్తుంటారు.
భారత్‌పై ప్రత్యేక దృష్టి
కెనడాకు వెళ్లినా ప్రేమ్ వత్సాకు భారత్‌తో అనుబంధం కొనసాగింది. ఫెయిర్‌ఫ్యాక్స్ భారత్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. థామస్ కుక్ ఇండియా, సీఎస్బీ బ్యాంక్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టింది. 2014లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్‌ను ఏర్పాటు చేసింది.
ఫెయిర్‌ఫ్యాక్స్ పెట్టుబడుల్లో భారత్ కీలక స్థానాన్ని సంపాదించింది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ వ్యాపారాలు, కుటుంబాలు, మౌలిక సదుపాయాలకు రుణాల అవసరం పెరుగుతుందని వత్సా భావిస్తున్నారు. అందుకే ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు కోసం నాలుగేళ్లకు పైగా ప్రయత్నించినట్లు ఆయన వెల్లడించారు.
ఐడీబీఐ బ్యాంక్‌పైనే ఎందుకు?
గతంలో ఐడీబీఐ బ్యాంక్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. నిరర్థక ఆస్తులు పెరగడంతో రుణాల మంజూరు, వ్యాపార విస్తరణపై ఆంక్షలు విధించారు. 2019లో ఎల్ఐసీ అతిపెద్ద వాటాదారుగా మారి బ్యాంకును స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగమైంది. ఆ తర్వాత బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఆర్బీఐ ఆంక్షలను ఎత్తివేసింది.
ఇప్పుడు బ్యాంకు మరింత విస్తరించేందుకు అవకాశాలున్నాయని వత్సా భావిస్తున్నారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 60.72 శాతం వాటాతో నిర్వహణ నియంత్రణ దక్కనుంది. లావాదేవీ పూర్తయితే కేంద్ర ప్రభుత్వ వాటా 15 శాతానికి, ఎల్ఐసీ వాటా 19 శాతానికి తగ్గుతాయని అంచనా. అయినప్పటికీ ఈ రెండు సంస్థలూ వాటాదారులుగా కొనసాగుతాయి.
ఈ ఒప్పందంతో ఐడీబీఐ బ్యాంకుకు ప్రైవేటు పెట్టుబడి, నిర్వహణ అనుభవం అందే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించడం ఫెయిర్‌ఫ్యాక్స్‌కు ప్రధాన సవాలుగా మారనుంది. ఒప్పందం విజయవంతమైతే భారత ఆర్థిక రంగంలో దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు ఏర్పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.