భారత్లో ఆడితే మాకు ఒక్క రూపాయి కూడా రాదు: వెస్టిండీస్ క్రికెట్ సీఈవో ఆవేదన
- సిరీస్ల ద్వారా భారత్ మిలియన్ల డాలర్లు సంపాదిస్తోందన్న క్రిస్ డెహ్రింగ్
- ప్రస్తుత పరిస్థితికి 1997లో ఐసీసీ తీసుకున్న నిర్ణయమే కారణమని ఆరోపణ
- ఈ నిర్ణయం వెస్టిండీస్ క్రికెట్ పతనానికి దారితీసిందని ఆవేదన
ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల రెవెన్యూ మోడల్పై క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సీఈవో క్రిస్ డెహ్రింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్లో పర్యటించి సిరీస్లు ఆడటం వల్ల తమ బోర్డుకు ఎలాంటి ఆదాయం రావడం లేదని, కానీ ఆతిథ్య దేశమైన భారత్ మాత్రం మిలియన్ల డాలర్లు ఆర్జిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
విజ్డన్ క్రికెట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్తో 2-2తో సమంగా ఉన్న టీ20 సిరీస్ను ఆయన ఉదాహరణగా చూపారు. "ఈ సిరీస్ భారత్లో జరుగుతోంది కాబట్టి, దీని ద్వారా వెస్టిండీస్ క్రికెట్కు ఎలాంటి ఆదాయం రాదు. ఈ సిరీస్తో భారత్ 20 నుంచి 30 మిలియన్ డాలర్లు సంపాదించవచ్చు, కానీ మాకు మాత్రం ఏమీ దక్కదు" అని డెహ్రింగ్ పేర్కొన్నారు.
ఈ సమస్యకు మూలం 1997లో ఐసీసీ సభ్య దేశాలు తీసుకున్న నిర్ణయమేనని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు, పర్యటించే జట్లకు ఆతిథ్య బోర్డులు కొంత రుసుము చెల్లించేవి. అయితే, 1997లో 9-1 ఓట్ల తేడాతో ఆ నిబంధనను మార్చారు. దీని ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్ల ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఆతిథ్య దేశానికే చెందుతుంది.
"ఈ నిర్ణయంతో ఒకటిన్నర బిలియన్ జనాభా ఉన్న భారత్ భారీ ఆదాయం పొందుతుంటే, 30,000 జనాభా ఉన్న సెయింట్ కిట్స్ వంటి చిన్న దేశాలు స్వల్ప ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇది చాలా అన్యాయం. ఈ నిర్ణయం వెస్టిండీస్ క్రికెట్ పతనానికి నాంది పలుకుతుందని నేను ఆనాడే చెప్పాను" అని డెహ్రింగ్ అన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ బోర్డు ఆర్థిక ఇబ్బందులతో ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధిస్తున్న నేపథ్యంలో డెహ్రింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద, చిన్న దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలపై మరోసారి చర్చ మొదలైంది.