సామూహిక అత్యాచారం.. మహిళపైనా కేసు పెట్టొచ్చు: ఢిల్లీ హైకోర్టు
- గ్యాంగ్రేప్ కేసులో మహిళలపైనా అభియోగాలు నమోదు చేయవచ్చన్న న్యాయస్థానం
- అత్యాచారానికి పాల్పడాలనే ఉమ్మడి ఉద్దేశం ఉంటే చాలని స్పష్టీకరణ
- నేరంలో శారీరకంగా పాల్గొనకపోయినా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్య
- భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70 ప్రకారం తీర్పు వెల్లడి
సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) కేసులో ఓ మహిళ నేరుగా శారీరకంగా పాలుపంచుకోకపోయినా, ఆ నేరానికి పాల్పడిన బృందంలో భాగమై ఉన్నా లేదా ఉమ్మడి ఉద్దేశంతో వ్యవహరించినా.. ఆమెపైనా అభియోగాలు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 376డి, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 70 కింద మహిళను కూడా నిందితురాలిగా చేర్చవచ్చని స్పష్టం చేసింది.
జస్టిస్ అనూప్ జైరాం భంభానీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఓ మహిళ, మరో నిందితుడిపై నమోదైన అభియోగాలను సవాలు చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. సామూహిక అత్యాచారానికి సంబంధించిన చట్టాల్లో ఉపయోగించిన ‘వ్యక్తులు’ అనే పదాన్ని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయలేమని, దాన్ని లింగ రహితంగా చూడాలని కోర్టు అభిప్రాయపడింది. ‘అత్యాచారం చేసినట్లుగా భావించాలి’ అనే వాక్యం, బృందంలోని ప్రతి సభ్యుడు నేరుగా నేరంలో పాల్గొనాల్సిన అవసరం లేదన్న శాసనసభ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
జులై 2024లో భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. తన మైనర్ కుమార్తెను ఓ సహ నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఓ మహిళ (తల్లి) బెదిరించి, బలవంతం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. డిసెంబర్ 2023 నుంచి జులై 2024 మధ్య ఈ ఘటన పలుమార్లు జరిగిందని తెలిపింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు బీఎన్ఎస్ సెక్షన్ 70(2), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ అభియోగాలను హైకోర్టు సమర్థించింది.
అయితే, ఒక మహిళ ఒంటరిగా అత్యాచారం చేయగలదా? లేదా? అనే అంశంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. సామూహిక అత్యాచారం కేసులో నేరపూరిత ఉద్దేశంతో పాలుపంచుకుంటే చాలు, లింగంతో సంబంధం లేకుండా బాధ్యత వహించాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.