భారత్ వైర్లెస్ డేటాలో 60 శాతం మాదే: ఆకాశ్ అంబానీ
- అక్టోబర్ 21 నుంచి 23 వరకు జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓ
- కంపెనీకి 53.3 కోట్ల మంది కస్టమర్లు, అందులో 28.5 కోట్ల మంది 5జీ యూజర్లు
- రూ.30,213 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఐపీఓ ఇష్యూ
- భారత్‌ను అతిపెద్ద డిజిటల్ సొసైటీగా మార్చడమే లక్ష్యమన్న జియో
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ తన మెగా ఐపీఓకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, జియో సాధించిన ప్రగతిని, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. దేశవ్యాప్త వైర్లెస్ డేటా ట్రాఫిక్‌లో 60 శాతానికి పైగా వాటాను జియో నెట్వర్క్ దక్కించుకుందని ఆయన వెల్లడించారు.
2026 జూన్ 30 నాటికి జియో వినియోగదారుల సంఖ్య 53.3 కోట్లకు చేరిందని, వీరిలో 28.5 కోట్ల మంది 5జీ వినియోగదారులేనని ఆకాశ్ అంబానీ తెలిపారు. చైనా మినహా ప్రపంచంలోనే ఇంతటి భారీ కస్టమర్ బేస్ కలిగిన ఏకైక సంస్థగా జియో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి పెరిగిందని, ఇది దేశంలో మారుతున్న డిజిటల్ అవసరాలకు నిదర్శనమని వివరించారు.
2016లో జియో సేవలు ప్రారంభమైన సమయంలో దేశంలో సగటు ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం కేవలం 2.5 ఎంబీపీఎస్‌గా ఉండగా, ఇప్పుడు అది 68 ఎంబీపీఎస్‌కి పెరిగిందని ఆయన గుర్తుచేశారు. జియో 5జీ సగటు డౌన్లోడ్ స్పీడ్ 198.9 ఎంబీపీఎస్‌గా నమోదైందని పేర్కొన్నారు. సరసమైన ధరలకే డేటా లభిస్తుండటంతో ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపులు వంటి సేవలు గణనీయంగా విస్తరించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కంపెనీ నెట్వర్క్ సామర్థ్యాన్ని వివరిస్తూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,60,537 టవర్లు, 26,800 MHz స్పెక్ట్రమ్‌తో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నిర్వహణ లాభం 17.8 శాతం వృద్ధితో రూ. 76,225 కోట్లుగా నమోదైందని తెలిపారు. అలాగే, జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య కూడా 2.8 కోట్లకు చేరుకుందని వివరించారు.
భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆకాశ్ అంబానీ పునరుద్ఘాటించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన నెట్వర్క్ సాఫ్ట్వేర్, పరికరాలను అంతర్జాతీయ ఆపరేటర్లకు విక్రయించే దిశగా యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 2031 నాటికి భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని, అందులో ప్రధాన వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ ఐపీఓ ద్వారా ఒక్కో షేరుకు రూ. 1,065 నుంచి రూ. 1,119 ధరల శ్రేణిలో గరిష్ఠంగా రూ. 30,213 కోట్లను సమీకరించాలని జియో భావిస్తోంది. ఈ ఇష్యూలో భాగంగా రూ. 10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల నూతన షేర్లను జారీ చేయనుంది. ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనుంది.