సీఎంవోలో 15 శాతం కమీషన్ దందా: రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
- ప్రాజెక్టుల్లో సీఎంవో 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తోందని విమర్శ
- ఓ నిర్మాణ సంస్థ ఎండీ రాసిన లేఖను విడుదల చేసిన కేటీఆర్
- ప్రజా సంక్షేమాన్ని వదిలి కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఏకంగా 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తోందని, ఇది అవినీతి పరాకాష్ఠ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం సొంత ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.
తన ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎండీ 2026 అక్టోబర్ 13న రాసినట్లు చెబుతున్న ఒక లేఖను కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) రేడియల్ రోడ్-2 టెండర్ల ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. సుశీ ఇన్ఫ్రా వంటి అర్హత కలిగిన సంస్థలను ఉద్దేశపూర్వకంగా అనర్హులుగా ప్రకటించి, ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ముడుపులు చెల్లించిన తర్వాతే బిల్లులు విడుదల చేస్తున్నారని, ఈ కమీషన్ల దందా వల్లే అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కేవలం వ్యక్తిగత లాభం, దోపిడీపైనే దృష్టి సారించిందని మండిపడ్డారు.