నా మొదటి బిడ్డ నువ్వే.. తమ్ముడిపై ప్రేమను కురిపించిన మృణాల్ ఠాకూర్
Add ap7am to your home Screen

నా మొదటి బిడ్డ నువ్వే.. తమ్ముడిపై ప్రేమను కురిపించిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur showers love on brother and calls him her first child
  • తమ్ముడు మందార్ ఠాకూర్‌కు మృణాల్ ఠాకూర్ స్పెషల్ బర్త్ డే విషెస్
  • నా మొదటి బిడ్డ, పార్ట్‌నర్ ఇన్ క్రైమ్ అంటూ ఎమోషనల్ నోట్
  • నీ నుంచి ఓపిక, కష్టపడే తత్వం నేర్చుకున్నానన్న నటి
  • ఎంత పెరిగినా నా దృష్టిలో నువ్వు చిన్న పిల్లాడివేనంటూ భావోద్వేగం
  • చిన్నప్పటి నుంచి ఉన్న పలు ఫొటోలను పోస్ట్ చేసిన మృణాల్
ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ తన తమ్ముడు మందార్ ఠాకూర్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. మందార్‌ను "నా మొదటి బిడ్డ", "నా నేరాల్లో భాగస్వామి", "ఎప్పటికీ నా చిన్నారి అబ్బాయి" అంటూ ప్రేమగా అభివర్ణించింది.

"నా మొదటి బిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ నుంచి నేను ఓపికను నేర్చుకున్నాను. కష్టపడి పనిచేయడం ఎలా ఉంటుందో చూపించావు. నిజమైన బలం అంటే ఏంటో గుర్తుచేశావు" అని మృణాల్ తన నోట్‌లో పేర్కొంది. మందార్ చాలా తెలివైనవాడని, మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించింది. సోదరుడిగా అతన్ని పొందడం తన అదృష్టమని, ఎన్ని జన్మలెత్తినా తమ్ముడిగా మందార్‌నే కోరుకుంటానంది.

"నువ్వు ఎంత పెరిగినా, నా దృష్టిలో ఎప్పటికీ చిన్న పిల్లాడివే. నీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థిస్తాను, గర్వపడతాను, నిన్ను ఎప్పుడూ కొంచెం ఎక్కువగానే ప్రేమిస్తాను" అని మృణాల్ రాసుకొంది. 

చివర్లో "ఐ నవ్ యూ 3000" అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఈ పోస్టుకు తమ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అందమైన ఫొటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక, సినిమాల విషయానికొస్తే.. మృణాల్ ఠాకూర్ ఇటీవల ‘పూజా మేరీ జాన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Advertisement
Mrunal Thakur
Mandar Thakur
Mrunal Thakur brother birthday
Mrunal Thakur Instagram post
Pooja Meri Jaan movie
Mrunal Thakur family photos

More Telugu News