తెలుగు యువకుడిపై దాష్టీకం.. అమెరికాలో పల్నాడు వ్యక్తికి 50 నెలల జైలు శిక్ష
- తెలుగు యువకుడిపై హింస, బలవంతపు శ్రమ కేసులో కోర్టు తీర్పు
- మరో ఇద్దరు నిందితులకు కూడా జైలు శిక్ష
- ప్రభుత్వ సంక్షేమ నిధులను మోసగించినట్లు కూడా విచారణలో నిర్ధారణ
- పల్నాడు జిల్లా యువకుడిని చదువు పేరుతో తీసుకెళ్లి దారుణాలు
- దోషి వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పుష్పారెడ్డి కుమారుడు
ఆంధ్రప్రదేశ్ యువకుడిని అమెరికాకు తీసుకెళ్లి, బలవంతంగా చాకిరీ చేయించుకోవడంతో పాటు తీవ్రంగా హింసించిన కేసులో వైసీపీ నేత కుమారుడు సత్తారు వెంకటేశ్‌రెడ్డికి అక్కడి న్యాయస్థానం 50 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మరో ఇద్దరికీ జైలు శిక్షలు పడ్డాయి.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెం గ్రామానికి చెందిన మార్తల పుల్లారెడ్డి అనే యువకుడిని, అదే గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సత్తారు పుష్పారెడ్డి కుమారుడు వెంకటేశ్‌రెడ్డి (38) 2022లో అమెరికాకు తీసుకెళ్లారు. ఇంటర్ చదివిన పుల్లారెడ్డికి ఉన్నత చదువులు చెప్పించి, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో వెంకటేశ్‌రెడ్డి ఇంట్లో బాధితుడు ఇంటి పనులతో పాటు ఆయన కంపెనీలో కూడా పనిచేసేవాడు.
ఈ క్రమంలో అతడిపై తీవ్రమైన హింస జరిగింది. ఇమిగ్రేషన్ పత్రాలు లాక్కోవడం, తిండి పెట్టకుండా మాడ్చడం, నిద్రపోనివ్వకపోవడం, ఆయుధాలతో దాడి చేయడం వంటి కిరాతకాలకు పాల్పడినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. 2023 నవంబర్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బాధితుడి శరీరంలో అనేక ఎముకలు విరిగి, తీవ్రంగా బరువు తగ్గి ఆసుపత్రి పాలయ్యారు.
ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ ఎ.రాస్, అక్టోబర్ 8న వెంకటేశ్‌రెడ్డికి 50 నెలల ఫెడరల్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇప్పటికే స్టేట్ కోర్టులో దాడి కేసులో పడిన ఐదేళ్ల శిక్షతో కలిపి ఈ శిక్ష కొనసాగుతుంది. ఈ కేసులో సహ నిందితులైన నిఖిల్ పెన్మత్సకు 37 నెలలు, శ్రవణ్ పెనుమెచ్చకు 30 నెలల జైలు శిక్ష విధించారు.
అమెరికా సైన్యంలో మాజీ ఉద్యోగి అయిన వెంకటేశ్‌రెడ్డి, తన వైకల్యాన్ని అతిగా చూపించి ప్రభుత్వ సంక్షేమ విభాగం నుంచి అదనంగా 83,776 డాలర్లు (సుమారు రూ.81 లక్షలు) పొందినట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఈ మోసానికి గాను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, వెటరన్స్ అఫైర్స్ విభాగాలకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాధితుడికి కూడా కొంత పరిహారం అందినట్లు సమాచారం. 2023లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు, ఈ ఉదంతం అమెరికాలోని తెలుగు ఎన్‌ఆర్‌ఐ సమాజంలో తీవ్ర కలకలం రేపింది.