విజయవాడ ఉత్సవ్ 2.0: ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ప్రశంసల లేఖ
- విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణపై ప్రధాని మోదీ హర్షం
- ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ లేఖ
- దసరా ఉత్సవాలతో పాటు అక్టోబర్ 11 నుంచి వేడుకలు
- ఈ ఉత్సవాలు పర్యాటకానికి కొత్త ఊపునిస్తాయని మోదీ ప్రశంస
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన ఒక లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలకు, వారి సాంస్కృతిక వారసత్వానికి మధ్య ఉన్న బంధాన్ని ఈ వేడుకలు మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
దసరా ఉత్సవాలకు అనుగుణంగా ఇవాళ్టి (అక్టోబర్ 11) నుంచి విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ప్రారంభం కానున్నాయి. నగరంలోని మకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్ సహా పలు ప్రాంతాలు ఈ ఉత్సవాలకు వేదికలుగా నిలవనున్నాయి. నగరం సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానిక ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం.
ఈ వేడుకలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జాతీయ సరస్ మేళాను కూడా నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే స్టాళ్లు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి పెట్టడంతో పాటు స్థానిక కళాకారులకు మద్దతు ఇవ్వడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ సహా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధాని నుంచి ప్రశంసలు రావడంతో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి నెలకొంది.