9/11 తరహాలో ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్‌పై దాడికి ప్లాన్.. ఫ్లైదుబై విమానంలో ఏం జరిగింది?
- ఫ్లైదుబై విమానాన్ని హైజాక్ చేసేందుకు కో-పైలట్ యత్నం
- గొడ్డలి దాడిని ప్రతిఘటించిన భారత కెప్టెన్, ప్రయాణికులు
- సౌదీ అరేబియాలో విమానం సురక్షితంగా ల్యాండింగ్
- ఇదొక ఉగ్రదాడి అని వెల్లడించిన యూఏఈ అధికారులు
యూఏఈకి చెందిన ఫ్లైదుబై విమానంలో జరిగిన హైజాక్ యత్నంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానాన్ని హైజాక్ చేసి, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై 9/11 తరహాలో ఆత్మాహుతి దాడికి పాల్పడాలని కో-పైలట్ పక్కా ప్రణాళిక రచించినట్లు యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సి అధికారికంగా ప్రకటించారు. ఒమన్‌కు చెందిన 29 ఏళ్ల కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైట్ ఎఫ్‌జెడ్ 1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, అల్ హమ్మామి కాక్‌పిట్‌లో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై క్రాష్ యాక్స్ (విమానంలోని చిన్న గొడ్డలి)తో దాడి చేశాడు. విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, బెన్ గురియన్ విమానాశ్రయ టెర్మినల్‌ను ఢీకొట్టాలని ప్రయత్నించాడు. అయితే, కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడినా ధైర్యంగా ప్రతిఘటించారు. ఆయన కేకలు విన్న రిజర్వ్ పైలట్, క్యాబిన్ సిబ్బంది, కొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ దాడికి అల్ హమ్మామి పక్కా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపే ఎయిర్‌లైన్‌లో చేరాలని ఉద్దేశపూర్వకంగానే ఫ్లైదుబైని ఎంచుకున్నట్లు అతను విచారణలో అంగీకరించాడని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దాడికి ముందు రెండుసార్లు టెల్ అవీవ్‌కు విమానం నడిపి మార్గం, విమానాశ్రయంపై సమాచారం సేకరించాడు. నిజానికి జులైలోనే దాడి చేయాలని భావించినా, ఆ విమాన సిబ్బందిలో తన స్నేహితుడు ఉండటంతో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
అంతకుముందు ఒమన్ ఎయిర్‌లో పనిచేస్తున్నప్పుడు అతడి తీవ్రవాద భావజాలం కారణంగా అతడిని ఫ్లైట్ డ్యూటీల నుంచి తప్పించి డెస్క్ జాబ్‌కు పరిమితం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను యూఏఈ అధికారులు ‘ఉగ్రవాద దాడి’గా నిర్ధారించారు. అల్ హమ్మామికి ఎవరైనా సహకరించారా? ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.