అమరావతి ఓఆర్ఆర్, పోలవరం బ్రిడ్జి.. కేంద్రానికి చంద్రబాబు కీలక విజ్ఞప్తులు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని వినతి
- పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ వంతెన నిర్మించాలని ప్రతిపాదన
- రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధికి బీచ్ రోడ్ ప్రాజెక్టుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
- ఏపీలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రానికి వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు, నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ఆయన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా, రాజధాని అమరావతి అభివృద్ధికి గుండెకాయ వంటి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 189 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ఓఆర్ఆర్, రాజధాని ప్రాంత అభివృద్ధిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో పెరిగే రవాణా అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే మరికొన్ని కీలక ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను అనుసంధానిస్తూ ఒక 'ఐకానిక్' వంతెన నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అవసరమైన రహదారులు, ఇతర వంతెనల నిర్మాణానికి సైతం కేంద్రం తోడ్పాటునందించాలని విన్నవించారు. రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక, పారిశ్రామిక కనెక్టివిటీని పెంచేందుకు బీచ్ రోడ్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా తీరప్రాంత నగరాలు, ఓడరేవులు, పర్యాటక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతుందని ఆయన వివరించారు.