కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది: శ్యామల
- గంజాయి నిర్మూలన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీసిన శ్యామల
- టీవీ షోలపై కాకుండా గంజాయిపై దృష్టి పెట్టాలని హోంమంత్రికి హితవు
- రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపణ
కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికల సమయంలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని శ్యామల అన్నారు. "హోంమంత్రి వంగలపూడి అనితకు టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తానన్న ఆమె సవాల్ ఏమైంది?" అని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు ఆడుతున్నది యువత భవిష్యత్తును నాశనం చేసే 'టాక్సిక్ గేమ్' అని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని శ్యామల అన్నారు. ఇటీవల అనకాపల్లిలో రూ.3 కోట్ల విలువైన గంజాయి, అల్లూరి జిల్లాలో రూ.1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయి పట్టుబడటమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి దొరకడం సిగ్గుచేటని విమర్శించారు.
‘ఈగల్’ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వేల కేసులు నమోదు చేసి, 6 లక్షల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారని... అలాంటప్పుడు గంజాయే లేదని ఎలా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. ఆపరేషన్ చైతన్య, గరుడ వంటి కార్యక్రమాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం మాటలు చెప్పడం మాని చేతల్లో చూపించాలని హితవు పలికారు.