‘సర్‌’ వివాదంలో కీలక పరిణామం.. 42 మంది మాజీ జడ్జీల సంచలన లేఖ
Add ap7am to your home Screen

‘సర్‌’ వివాదంలో కీలక పరిణామం.. 42 మంది మాజీ జడ్జీల సంచలన లేఖ

Key development in SSR controversy 42 former judges write sensational letter
  • ఈసీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన
  • ఆధారాలు లేకుండా ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు చేయొద్దంటూ అభ్యంతరం
  • ‘సర్‌’ చట్టబద్ధమైన ప్రక్రియ అని మాజీ జడ్జీల మద్దతు
  • ఎన్నికలపై నమ్మకం దెబ్బతింటే అశాంతి పెరుగుతుందని హెచ్చరిక
  • రాజ్యాంగ సంస్థలను కించపరచొద్దని హితవు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ 42 మంది మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సంఘం (ఈసీఐ), న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆధారాలు లేకుండా ‘ఓట్ల చోరీ’ అంటూ ఆరోపణలు చేయడంపై మాజీ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను పదేపదే ‘దొంగలు’, ‘లోపభూయిష్టమైనవి’ అంటూ ముద్ర వేయడం ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

‘సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యంలో హక్కు. కానీ వాటిని కించపరచడం మాత్రం కాదు’ అని లేఖలో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి విశ్వాసమే కీలకమని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన చట్టబద్ధమైన ప్రక్రియ ‘సర్‌’ అని మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఎన్నికలపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు అశాంతికి దారితీయొచ్చని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు అరాచక శక్తులకు ఊతమివ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హేమంత్ గుప్తా, జస్టిస్‌ పంకజ్ మిట్టల్ సహా పలువురు ఈ లేఖపై సంతకం చేశారు. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీసీ పటేల్, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుభ్రో కమల్ ముఖర్జీ, సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రమోద్ కోహ్లీ కూడా సంతకం చేసిన వారిలో ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పందించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికల్లో గెలిచిన స్థానాలకు ప్రతిపక్ష నేతలు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో విషం నింపే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
Former Judges
Election Commission of India
Special Summary Revision
Voter Theft Allegations
Constitutional Institutions
Justice Hemant Gupta

More Telugu News