నెల్లూరు జిల్లాలో అద్భుత సన్నివేశం.. శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్రదక్షిణ.. ఇదిగో వీడియో!
- నెల్లూరు జిల్లా మనుబోలులోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఘటన
- ప్రదక్షిణ తర్వాత ఆలయంలోని పుట్టలోకి వెళ్లిన నాగుపాములు
- గతంలోనూ ఇదే ఆలయంలో పలుమార్లు కనిపించిన నాగసర్పాలు
నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం మూడు నాగుపాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించాయి. శివలింగాన్ని చుట్టుకొని, కొద్దిసేపు అక్కడే పడగవిప్పి ఉన్న సర్పాలను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ మూడు పాములు ఆలయంలోనే ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు భక్తులు తమ ఫోన్లలో వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజే ఇలా మూడు నాగసర్పాలు కనిపించడం దైవ సంకేతంగా భక్తులు భావిస్తున్నారు.
ఈ ఆలయంలో నాగుపాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మే 17న కూడా అభిషేకం తర్వాత శివలింగంపై ఓ నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది. అలాగే, గతేడాది అక్టోబర్‌లో నాగుల చవితి రోజున రెండు నాగుపాములు శివలింగం పక్కన కనిపించి భక్తులను ఆశ్చర్యపరిచాయి. తరచూ ఇలా నాగసర్పాలు దర్శనమివ్వడం ఆ క్షేత్ర మహత్యంగా స్థానికులు చెబుతున్నారు.