బెంగళూరు, బీదర్ మధ్య లైఫ్ స్టయిల్ పై డాక్టర్ పోస్ట్.. నెట్టింట కొత్త చర్చ!
- బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్
- నగరంతో పోలిస్తే బీదర్‌లో ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతోందని వెల్లడి
- మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తయ్యాయని వ్యాఖ్య
- డాక్టర్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు
మహానగరాల్లోని యాంత్రిక జీవనానికి, చిన్న పట్టణాల్లోని ప్రశాంత వాతావరణానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో సమయం ఎప్పుడూ సరిపోనట్లుగా అనిపిస్తుందని, అదే కర్ణాటకలోని బీదర్ వంటి టైర్-3 పట్టణాల్లో పుష్కలంగా ఖాళీ సమయం దొరుకుతోందని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
'ది ఫిట్‌డాక్' పేరుతో 'ఎక్స్' ఖాతా నిర్వహిస్తున్న సదరు వైద్యుడు, బెంగళూరులో ఉన్నప్పుడు ఒక్క రోజు సెలవు కూడా సరిపోయేది కాదని, అది తనను తరచూ అసంతృప్తికి గురిచేసేదని తెలిపారు. అయితే, బీదర్‌లో తన అనుభవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. "ఇక్కడ లాంగ్ రన్‌కు వెళ్లాను, భోజనం ముగించి కాసేపు నిద్రపోయాను. అయినా అప్పటికీ సమయం మధ్యాహ్నం రెండు గంటలే అయింది. బహుశా ఈ సాయంత్రం సినిమాకు కూడా వెళ్లే వీలుంది" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి వివిధ రకాల స్పందనలు వచ్చాయి. "బహుశా మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఉంటారు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "నాకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది" అని మరొకరు పేర్కొన్నారు. "చిన్న పట్టణాల్లో మనల్ని పరధ్యానానికి గురిచేసే అంశాలు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం" అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.