మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్!
- లొంగిపోయిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ అవకాశం
- ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ వీడియో వైరల్ అవడంతో గుర్తింపు
- బస్తర్ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించే ఛాన్స్
ఛత్తీస్‌గఢ్‌లో హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్‌లో నటించే అరుదైన అవకాశం లభించింది. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో వారు చేసిన ర్యాంప్ వాక్ వీడియో వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించి, ఈ ఆఫర్ వారిని వరించింది.
సుక్మా జిల్లాకు చెందిన ఈ తొమ్మిది మంది మహిళలు ఆగస్టులో రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామోద్యోగ్ శాఖ నిర్వహించిన ఈ షోలో వారు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'బెంగాల్ 1947' చిత్ర దర్శకుడు ఆకాశ్ ఆదిత్య లామా వీరిని గమనించారు. తన తర్వాతి సినిమాలో వీరికి అవకాశం కల్పించేందుకు ఆయన ఆసక్తి చూపారు.
1994లో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఒక సున్నితమైన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మావోయిజం ప్రభావిత ప్రాంతాల్లో జీవించిన ఈ మహిళల అనుభవాలు పాత్రలకు సహజత్వాన్ని తెస్తాయని చిత్రబృందం భావిస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో బస్తర్ అడవుల్లోనే షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంపికైన వారికి షూటింగ్‌కు ముందు ఆడిషన్లు నిర్వహించి, 10-15 రోజుల పాటు నటనలో ప్రత్యేక వర్క్‌షాప్ కూడా నిర్వహించనున్నారు.
ఈ పరిణామంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి హర్షం వ్యక్తం చేశారు. హింసను వీడిన వారికి ఇలాంటి అవకాశాలు రావడం వారి పునరావాసానికి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి దోహదపడుతుందని అన్నారు. ఒకప్పుడు తుపాకులు పట్టిన చేతులతో ఇప్పుడు కెమెరా ముందుకు రానుండటం విశేషం.