అంతా బాగుందనుకుంటే ప్రమాదమే.. రానున్న ఆర్థిక సవాళ్లపై ఆర్‌బీఐ గవర్నర్ వార్నింగ్
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆర్‌బీఐ గవర్నర్
- ఆర్థిక ముప్పులపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్న మల్హోత్రా
- ప్రపంచ దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని వెల్లడి
- వాణిజ్య ఆంక్షలు, సరఫరా సమస్యలు ప్రభావం చూపుతున్నాయని ప్రకటన
- ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా బయటపడొచ్చని హెచ్చరిక
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాలు, వాణిజ్య ఆంక్షలు, సరఫరా సమస్యలు, సాంకేతిక మార్పులు, వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ముప్పుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోవిడ్ తర్వాత ప్రపంచం ఎన్నో ఆర్థిక, ఇతర సంక్షోభాలను ఎదుర్కొందని మల్హోత్రా తెలిపారు. అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాటిని తట్టుకుని నిలబడిందన్నారు. భారత్‌లోనూ చాలాకాలంగా ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని చెప్పారు.
అయితే ఇదే స్థిరత్వం మరో సమస్యకు దారి తీయొచ్చని ఆయన హెచ్చరించారు. చాలాకాలం ఎలాంటి పెద్ద సంక్షోభం రాకపోతే గతంలో ఎదురైన సమస్యలను ప్రజలు, సంస్థలు మర్చిపోతారని అన్నారు. దీంతో ఎక్కువ రిస్క్ తీసుకోవడం, భారీగా అప్పులు చేయడం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఒక్కసారిగా సమస్యలు రావొచ్చు
బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో సమస్యలు ఒక్కసారిగా బయటపడే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. అయితే వాటిని పూర్తిగా పరిష్కరించడానికి మాత్రం చాలా సమయం పడుతుందని చెప్పారు. అందుకే పరిస్థితులు బాగున్న సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గతంలో నడిపించిన విధానాల్లో ఇప్పుడు మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక విభేదాలు పెరుగుతున్నాయని చెప్పారు. వాణిజ్య ఆంక్షలు, సరఫరా అంతరాయాలు కూడా తరచూ ఎదురవుతున్నాయని తెలిపారు.
ఈ మార్పులన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రభావం చూపుతున్నాయని మల్హోత్రా అన్నారు. అందువల్ల కేంద్ర బ్యాంకులు కేవలం ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వంపైనే దృష్టి పెట్టకుండా ప్రపంచ పరిణామాలను కూడా గమనించాలని సూచించారు.