‘ఫ్లైదుబాయ్’ని కూల్చేసే కుట్ర.. ఆరేళ్ల చిన్నారి అరుపు అందరినీ ఎలా కాపాడిందంటే?
- విమానంలో కెప్టెన్‌పై కత్తితో దాడి చేసిన ఒమన్ కో-పైలట్
- బాత్రూంలో నుండి 'డాడ్' అంటూ అరిచిన చిన్నారి
- బాత్రూం వైపు పరుగెత్తిన తండ్రి
- పాక్షికంగా తెరిచిన డోర్ నుంచి కాక్‌పిట్‌లో ఘటనను గమనించిన ప్రయాణికుడు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించిన కో-పైలట్ కుట్రను కెప్టెన్, ప్రయాణికులు అత్యంత సాహసోపేతంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి వందలాది మంది ప్రాణాలను కాపాడటంలో ఓ ఆరేళ్ల చిన్నారి కేక కీలక మలుపుగా నిలిచింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హీరోగా నిలిచారు.
సెప్టెంబర్ 30న విమానం గాల్లో ఉన్న సమయంలో, టాయిలెట్ నుంచి ఓ ఆరేళ్ల చిన్నారి ‘డాడ్’ అని గట్టిగా అరిచింది. ఆ కేక విన్న చిన్నారి తండ్రి జ్వీకా మానీస్ ఆందోళనతో వెంటనే టాయిలెట్ వద్దకు పరుగెత్తాడు. పాక్షికంగా తెరిచి ఉన్న తలుపు నుంచి కాక్‌పిట్ లోపలకి చూడగా, తీవ్ర గాయాలతో కత్తిపోట్లకు గురై రక్తమోడుతున్న కెప్టెన్ స్మిత్, తన ఒమానీ కో-పైలట్‌తో ప్రాణాలకు తెగించి పోరాడుతూ కనిపించాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపును తెరిచాడు.
వెంటనే జ్వీకా మానీస్‌తో పాటు మరికొందరు ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి, హెడ్‌ఫోన్ వైర్ల సాయంతో కో-పైలట్‌ను బంధించారు. ఆ పెనుగులాట సమయంలో విమానం కేవలం రెండు నిమిషాల్లోనే వేల అడుగుల ఎత్తు నుంచి కిందకి పడిపోయింది. అయితే, ప్రయాణికులుగా ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో 172 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వారిని మరో విమానంలో టెల్ అవీవ్‌కు తరలించారు. విమానాన్ని కూల్చేసే కుట్రను భగ్నం చేసిన కెప్టెన్ స్మిత్ సాహసాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. ప్రస్తుతం అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులు ఆయన వద్దే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై యూఏఈ, సౌదీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.