నర్సింగ్ జాబ్ పేరుతో మోసం.. దుబాయ్‌లో రాంచీ యువతికి నరకం
- దుబాయ్‌లో నర్సు ఉద్యోగమని చెప్పి రాంచీ యువతికి మోసం
- పాస్‌పోర్ట్ లాక్కొని, అరబిక్ పత్రాలపై బలవంతంగా సంతకాలు
- వెట్టిచాకిరి చేయిస్తూ బందీగా మార్చిన ఏజెంట్లు
- ముగ్గురు ఏజెంట్లపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు
- యువతిని రప్పించేందుకు రంగంలోకి దిగిన భారత రాయబార కార్యాలయం
రాంచీకి చెందిన ఓ నర్సు దుబాయ్‌లో ఉద్యోగం పేరుతో మోసపోయి, అక్కడ బందీగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఏజెంట్లు, ఆమెను గృహనిర్బంధంలో ఉంచి వెట్టిచాకిరి చేయిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
రాంచీలోని ఛోటా ఘాఘ్రా ప్రాంతానికి చెందిన మోనికా కచ్చప్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఓ ఉద్యోగ ప్రకటన చూసి సంబంధిత రిక్రూటింగ్ ఏజెన్సీని సంప్రదించింది. ఏప్రిల్ 22న ప్రియాంక అనే ఏజెంట్‌కు రూ. 15,000 బదిలీ చేయగా, ఆ తర్వాత విమాన టికెట్లకు కూడా డబ్బులు చెల్లించి, మే 5న ఢిల్లీ నుంచి షార్జాకు వెళ్లింది.
ఎయిర్‌పోర్ట్‌లో కంపెనీ పంపిన డ్రైవర్ ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకున్నాడు. మరుసటి రోజు ఆమెను అజ్మాన్‌లోని ఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రియాంక భర్త రితేష్, ఎండీ మెరాజ్ అన్సారీ అనే వ్యక్తులు అరబిక్‌లో ఉన్న పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితురాలు తన కుటుంబసభ్యులకు తెలిపింది. ఆ తర్వాత, ఆమె 12,600 దిర్హామ్‌ల రుణం తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారని, ఆ మొత్తం తిరిగి చెల్లించే వరకు భారత్‌కు వెళ్లలేవని చెప్పారని వాపోయింది.
ప్రస్తుతం ఆమె వీసా గడువు కూడా ముగిసింది. పాస్‌పోర్ట్ లాక్కొని, ఇంట్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లోని అబూ బకర్ అల్ సిద్ధిఖ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంటున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రాంచీ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏజెంట్లు ప్రియాంక ఆర్య, ఆమె భర్త రితేష్, ఎండీ మెరాజ్ అన్సారీలపై చీటింగ్, బలవంతపు వెట్టిచాకిరి, అక్రమ నిర్బంధం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువతిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని పోలీస్ అధికారి పంకజ్ శర్మ తెలిపారు. కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించారు.