ప్రధాని అయినా లోన్ తీసుకొని కారు కొన్న లాల్ బహదూర్ శాస్త్రి!
- కొత్త ఫియట్ ధర అప్పట్లో రూ.12 వేలు
- శాస్త్రి ఖాతాలో రూ.ఏడు వేలు
- మిగిలిన రూ.5 వేల కోసం బ్యాంకు లోన్
- కారు రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్‌ఈ 6
- శాస్త్రి మరణించాక ఆయన భార్య పెన్షన్‌తో రుణం చెల్లింపు
దేశానికి ప్రధానిగా ఉన్నారు.. అధికారిక కారు అందుబాటులో ఉంది. అయినా కుటుంబ అవసరాల కోసం దాన్ని సొంత పనులకు వాడేందుకు లాల్‌బహదూర్ శాస్త్రి ఇష్టపడలేదు. చివరకు ఇంట్లో సొంతంగా ఓ కారు ఉండాలని భావించారు. కారు కొనడానికి బ్యాంకు లోన్ తీసుకున్నారు. అప్పటి రోజుల్లో తీసుకున్న ఆ రూ.5 వేల రుణం వెనుక ఉన్న కథ.. శాస్త్రి నిరాడంబర జీవనశైలికి మరో ఉదాహరణగా నిలిచింది.
స్కూలుకు టాంగా..
లాల్‌బహదూర్ శాస్త్రి పిల్లలు సాధారణంగా స్కూలుకు టాంగాలో వెళ్లేవారని ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి చెప్పారు. అప్పుడప్పుడు అధికారిక కారును ఉపయోగించే అవకాశం ఉన్నా.. కుటుంబ సభ్యుల వ్యక్తిగత అవసరాలకు దాన్ని తరచూ వాడేందుకు శాస్త్రి అనుమతించేవారు కాదట. దీంతో ఇంట్లో సొంతంగా ఓ కారు ఉంటే బాగుంటుందని కుటుంబం భావించింది. కొత్త ఫియట్ కారు కొనాలని నిర్ణయించారు.
కారు ధర రూ.12 వేలు..
అప్పట్లో కొత్త ఫియట్ కారు ధర సుమారు రూ.12 వేలుగా ఉండేదట. శాస్త్రి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.7 వేలే ఉన్నాయి. దీంతో మరో రూ.5 వేల అవసరం వచ్చింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని అడిగి సమకూర్చుకోవడం కాకుండా.. శాస్త్రి బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5 వేల లోన్ తీసుకున్నట్లు ఆయన కుమారుడి జ్ఞాపకాల ఆధారంగా తెలుస్తోంది. అలా 1964లో ఫియట్ కారును కొనుగోలు చేశారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్‌ఈ 6.
శాస్త్రి మరణించినా..
1966 జనవరి 11న తాష్కెంట్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి కన్నుమూశారు. అప్పటికి కారు రుణం పూర్తిగా చెల్లించలేదు. ఆ తర్వాత ఆయన భార్య లలితా శాస్త్రి.. తనకు వచ్చిన పెన్షన్ నుంచి మిగిలిన రుణాన్ని చెల్లించినట్లు కుమారుడు అనిల్ శాస్త్రి చెప్పినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. నేడు ఆ కారు న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ప్రదర్శనలో ఉంది. క్రీమ్ రంగులో ఉన్న ఆ పాత ఫియట్.. శాస్త్రి నిరాడంబర జీవనానికి గుర్తుగా నిలిచింది.