ఫ్లైదుబాయ్ ఘటన.. పైలట్ స్మిత్ మచ్చర్ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్

ఫ్లైదుబాయ్ ఘటన.. పైలట్ స్మిత్ మచ్చర్ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్

FlyDubai incident Pilot Smith Machhar airlifted to UAE
  • కో-పైలట్ దాడి ఘటనలో గాయపడిన స్మిత్ మచ్చర్
  • చికిత్స కోసం యూఏఈకి తరలింపు
  • స్మిత్ మచ్చర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న భారత రాయబార కార్యాలయం
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం యూఏఈకు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. దుబాయ్-ఇజ్రాయెల్ విమానంలో కో-పైలట్ దాడికి దిగిన అనంతరం, ఆ విమానం సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ అయిన విషయం విదితమే. విమానం ల్యాండ్ అయిన వెంటనే కెప్టెన్ మచ్చర్‌ను అక్కడి సైనిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ప్రస్తుతం ఆయనను తదుపరి వైద్యం కోసం యూఏఈకి తరలించగా, స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కాగా, సహ పైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.
Advertisement
Captain Smith Machhar
FlyDubai
Dubai Israel flight
Saudi Arabia
UAE airlift
Indian pilot

More Telugu News