నాగార్జున సూపర్ హిట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ 'గీతాంజలి' రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
- నవంబర్ 13న థియేటర్లలోకి 'గీతాంజలి'
- మెరుగైన క్వాలిటీ కోసం గతంలో వాయిదాపడిన చిత్రం
- తెలుగు, తమిళ భాషల్లో 4K వెర్షన్ రిలీజ్
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా 'గీతాంజలి' రీ-రిలీజ్‌కు తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 4K డిజిటల్ వెర్షన్‌లో నవంబర్ 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.
గతంలో ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, పిక్చర్, సౌండ్ క్వాలిటీని మరింత మెరుగుపరిచేందుకు అదనపు పునరుద్ధరణ పనులు అవసరం కావడంతో విడుదల వాయిదా పడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఇప్పుడు కొత్త తేదీతో స్పష్టత ఇచ్చింది.
1989లో విడుదలైన 'గీతాంజలి' అప్పట్లో ఓ సంచలనం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. నాగార్జున-గిరిజ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఇళయరాజా సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 4K టెక్నాలజీతో మళ్లీ పెద్ద తెరపైకి తీసుకురానున్నారు. శ్రీ పద్మిని సినిమాస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది.