ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న ఎనిమిది సినిమాలు ఇవే!
- రేపు థియేటర్ల దగ్గర కనిపించనున్న సందడి
- ఫహాద్ ఫాజిల్ తెలుగు సినిమాపై బజ్
- భారీస్థాయిలో రిలీజ్ అవుతున్న 'సిగ్మా'
- దర్శకుడిగా విజయ్ తనయుడి ప్రయత్నం
- లైన్లో మరో మూడు తెలుగు సినిమాలు
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర కాస్త గట్టిగానే సందడి కనిపించేలా ఉంది. సాధారణంగా ఫ్రైడే వస్తే ఒకటి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. లేదంటే రెండు మూడు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే ఈ శుక్రవారం 8 సినిమాల వరకూ థియేటర్లలో దిగిపోవడానికి సిద్ధమయ్యాయి. వాటిలో ఒకటిగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కనిపిస్తోంది. ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉండటంతో, సహజంగానే ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి.
సందీప్ కిషన్ 'సిగ్మా' కూడా రేపు భారీస్థాయిలో విడుదలవుతోంది. హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఫరియా అబ్దుల్లా కథానాయికగా అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక హర్ష్ రోషన్ - నక్షత్ర జంటగా నటించిన లవ్ స్టోరీగా 'తెల్లకాగితం' రూపొందిన సంగతి తెలిసిందే. కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకి 'నందు' దర్శకత్వం వహించాడు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది.
ఈ శుక్రవారం రోజునే 'అనకాపల్లి' సినిమా కూడా ఆడియన్స్ ను పలకరించనుంది. విక్రమ్ సహదేవ్ - సంధ్య - తారక్ పొన్నప్ప ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆది పినిశెట్టి హీరోగా నిర్మితమైన 'ఎస్ ఐ యుగంధర్' కూడా డిఫ్ రోజున థియేటర్లకు రానుంది. యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మేఘలేఖ అలరించనుంది. ఇక 'సిగ్మా'తో పాటు మరికొన్ని అనువాద చిత్రాలు రేపటి సినిమాల జాబితాలో ఉన్నాయి. ఆ వరుసలోనే 'డోరతి' .. 'ప్రేమనే ఊరిలో' .. 'దృశ్యం ది కంక్లూజన్' కనిపిస్తున్నాయి. ఈ సినిమాలలో దేనికి ఆడియన్స్ వైపు నుంచి ఎక్కువ మార్కులు దక్కుతాయనేది చూడాలి మరి.