విద్యారంగం ముసుగులో చైనా గూఢచర్యం..! వర్సిటీలకు యూకే ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
- చైనా రీసెర్చ్ సంస్థ CGTRI ఒక గూఢచర్య ముసుగు సంస్థ అని MI5 వెల్లడి
- సదరు సంస్థతో సంబంధాలు తెంచుకోవాలని వర్సిటీలకు యూకే ప్రభుత్వం ఆదేశం
- ఆదేశాలు మీరితే జాతీయ భద్రతా చట్టం కింద చర్యలని హెచ్చరిక
చైనాకు చెందిన ఒక పరిశోధన సంస్థ తమ దేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని బ్రిటన్ సంచలన ఆరోపణలు చేసింది. విద్యారంగం ముసుగులో కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో, చైనా జనరల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CGTRI) అనే సంస్థతో తక్షణమే అన్ని సంబంధాలు తెంచుకోవాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు యూకే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
యూకే డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ఈ మేరకు ఒక "ఎస్పియనేజ్ అలర్ట్" (గూఢచర్య హెచ్చరిక) జారీ చేసింది. చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS)కి CGTRI ఒక ముసుగు సంస్థగా పనిచేస్తోందని MI5 ఆరోపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థల వంటి కీలక టెక్నాలజీని దొంగిలించడమే లక్ష్యంగా, యూకే విద్యావేత్తల పరిశోధనలకు ఈ సంస్థ రహస్యంగా నిధులు సమకూరుస్తోందని వివరించింది. ఈ వ్యవహారంలో 100 మందికి పైగా యూకే విద్యావేత్తల ప్రమేయం ఉన్నట్లు MI5 పేర్కొంది. చాలామంది విద్యావేత్తలు విషయం తెలియకనే ఇందులో భాగమయ్యారని కూడా తెలిపింది.
MI5 హెచ్చరికల నేపథ్యంలో యూకే భద్రతా మంత్రి డాన్ జార్విస్ స్పందించారు. "మన విద్యావేత్తల నైపుణ్యం నుంచి చైనా ఇంటెలిజెన్స్ రహస్యంగా లబ్ధి పొందే ప్రయత్నాలను ఈ హెచ్చరిక బయటపెట్టింది. ఇది మన జాతీయ భద్రతకు ముప్పు" అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి CGTRIతో సంబంధాలు కొనసాగిస్తే జాతీయ భద్రతా చట్టం 2023 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, యూకే ఆరోపణలను లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా కల్పితమైన, ఊహాజనిత ఆరోపణలని కొట్టిపారేసింది. ఈ నిరాధార ఆరోపణలపై యూకే ప్రభుత్వానికి నిరసన తెలిపామని కూడా వెల్లడించింది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో తదుపరి చర్యలపై సమీక్ష జరుపుతున్నామని యూనివర్సిటీస్ యూకే ప్రతినిధులు తెలిపారు.