ఇంత భిన్నమైన అభిప్రాయాలు వస్తాయని ఊహించలేదు.. ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్యారడైజ్ సినిమాపై భిన్న స్పందనలు
- తన 33 సినిమాల్లో ఇలాంటి స్పందన తొలిసారన్న నాని
- తీవ్ర విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకున్నామని వెల్లడి
- ఇంత భిన్న స్పందన ఊహించలేదన్న నాని
- స్పందనను ఇంకా అర్థం చేసుకుంటున్నానన్న శ్రీకాంత్ ఓదెల
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’కు ప్రేక్షకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సినిమా నచ్చిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని స్పందించారు. తన 18 ఏళ్ల కెరీర్‌లో 33 సినిమాలు చేసినా.. ఇలాంటి భిన్నమైన స్పందనను తొలిసారి చూస్తున్నానని చెప్పారు.
సినిమాపై విమర్శలు వచ్చినా వాటిలో కనిపిస్తున్న తీవ్రతను తాము సానుకూలంగానే తీసుకున్నామని నాని తెలిపారు. సినిమా నచ్చలేదని ఎవరైనా బలంగా చెబితే.. అది కూడా ప్రేక్షకుల స్పందనేనని పేర్కొన్నారు.
‘ది ప్యారడైజ్’కు తీవ్ర స్థాయిలో స్పందనలు రావొచ్చని ముందే తెలుసని నాని చెప్పారు. అయితే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత భిన్నమైన అభిప్రాయాలు వస్తాయని ఊహించలేదన్నారు. ఇది తనకు ఒక కొత్త అనుభవమని చెప్పారు.
మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా స్పందించారు. సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందనను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని తెలిపారు. మరికొంత సమయం తీసుకుని ప్రేక్షకుల స్పందనను అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.
ఇదే విషయంపై నాని, సినిమా విడుదలైన మరుసటి రోజే సోషల్ మీడియాలో స్పందించారు. ప్రేక్షకుల ప్రేమతో పాటు, ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నానని చెప్పారు. సినిమా బాగోలేదని విమర్శకులు చెప్పిన అంశాల నుంచి కూడా నేర్చుకున్నానని తెలిపారు. ప్రేక్షకుల కోసం ఎంతో కష్టపడి ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు సినిమా చేశామని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 24న విడుదలైన ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.