లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు.. ఇతర నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన

లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు.. ఇతర నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన

Rajdeep Sardesai praises Nara Lokesh and says other leaders should learn from him
  • కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేశ్‌ను ఇంటర్వ్యూ చేసిన రాజ్‌దీప్ 
  • స్క్రిప్ట్ లేకుండా కఠిన ప్రశ్నలకు సూటిగా బదులిచ్చారని కొనియాడిన వైనం
  • చాలా స్పష్టంగా సమాధానాలు ఇచ్చారని ప్రశంస
సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించారు. తాను చేసిన ఇంటర్వ్యూలో లోకేశ్ వ్యవహరించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కఠినమైన ప్రశ్నలకు కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారని కొనియాడారు.

కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్.. మంత్రి లోకేశ్‌ను ముఖాముఖి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇంటర్వ్యూ చివరలో రాజ్‌దీప్ మాట్లాడుతూ... మీరు అడగబోయే ప్రశ్నల జాబితా ముందే ఇవ్వండి అని అడగని నాయకులను ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడూ సులభంగా ఉంటుందని అన్నారు. 

ఈ ఇంటర్వ్యూపై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా నిన్న స్పందించారు.  ఈ చర్చలో దేశం గురించి, రాష్ట్రం గురించి, పాలన గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడినట్టు వెల్లడించారు. ఎలాంటి స్క్రిప్ట్ అవసరం లేకుండానే రాజ్‌దీప్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు.

అందుకు రాజ్ దీప్ నేడు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలపై గతంలో నాయకులందరూ ఇలాగే ఉండేవారని, కానీ ఇప్పుడు అది చాలా అరుదుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇతర నేతలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తున్నాను అంటూ రాజ్‌దీప్ మంత్రి లోకేశ్ కు కితాబిచ్చారు.

Advertisement
Nara Lokesh
Rajdeep Sardesai
India Today South Conclave
Andhra Pradesh Politics
Unscripted Interview
TDP Leader Nara Lokesh

More Telugu News