ఆసియా క్రీడల్లో నాయుడుపేట కుర్రాడి సత్తా.. నారా లోకేశ్ స్పందన
- తెలుగు ఆర్చర్ గణేశ్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
- ఆసియా గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం
- ఇప్పటికే టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన గణేశ్
- రాష్ట్రానికి, దేశానికి గణేశ్ గొప్ప గౌరవం తెచ్చాడన్న లోకేశ్
- తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు
ఆసియా గేమ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ గణేశ్ మణిరత్నం తిరుమూరుపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో కాంస్య పతకం గెలవడం ద్వారా గణేశ్ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో గణేశ్ సత్తా చాటాడు. వియత్నాంకు చెందిన కాంగ్ డక్ డాంగ్‌పై 149–144 పాయింట్ల తేడాతో అతడు విజయం సాధించి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు, పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోనూ గణేశ్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇప్పుడు వ్యక్తిగత విభాగంలోనూ పతకం సాధించి తన అద్భుత నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు.
గణేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందినవాడు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. గణేశ్ ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాడని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మరిన్ని గొప్ప విజయాలు అందించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.