బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన.. రేపల్లెలో కొత్త పింఛన్లను ప్రారంభించనున్న చంద్రబాబు
Advertisement

బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన.. రేపల్లెలో కొత్త పింఛన్లను ప్రారంభించనున్న చంద్రబాబు

CM visit in Bapatla district Chandrababu to launch new pensions in Repalle
  • నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
  • రేపల్లెలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • లబ్ధిదారులతో ముఖాముఖి, బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం
  • సాయంత్రం టీడీపీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. బాపట్ల జిల్లా రేపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేయనున్నారు. 'పేదల సేవ' పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.

సీఎం ప‌ర్య‌ట‌న పూర్తి షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, 11:00 గంటలకు రేపల్లె చేరుకుంటారు. ఉదయం 11:25 గంటలకు రేపల్లె పట్టణంలోని 4వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం 3:25 గంటలకు రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5:20 గంటలకు సీఎం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Advertisement
Chandrababu Naidu
NTR Bharosa Scheme
Bapatla District
Repalle Visit
Andhra Pradesh Pensions
TDP Leaders Meeting

More Telugu News