చాట్‌జీపీటీలో ఇక టీమ్‌తో కలిసి పని చేయొచ్చు.. ఓపెన్‌ఏఐ కొత్త ‘స్పేస్‌’ అదిరిపోయే ఫీచర్లు ఇవే!
Advertisement

చాట్‌జీపీటీలో ఇక టీమ్‌తో కలిసి పని చేయొచ్చు.. ఓపెన్‌ఏఐ కొత్త ‘స్పేస్‌’ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

OpenAI launches ChatGPT Space for team collaboration and productivity
  • పేజీలు క్రియేట్‌, ఎడిట్ చేసే వీలు
  • ఫైళ్లు, కంటెంట్ ఒకేచోట నిర్వహణ
  • ఇతరులతో రియల్‌టైమ్ సహకారం
  • ప్రో, బిజినెస్‌, ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకు అందుబాటులో
  • వెబ్‌, డెస్క్‌టాప్‌లో ఎడిటింగ్ సపోర్ట్
చాట్‌జీపీటీను కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే టూల్‌గా కాకుండా.. పనులను నిర్వహించుకునే వర్క్‌స్పేస్‌గా మార్చే దిశగా ఓపెన్‌ఏఐ మరో కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘చాట్‌జీపీటీ స్పేస్‌’ పేరుతో కొత్త హబ్‌ను ప్రకటించింది. ఇందులో చాట్‌జీపీటీ సాయంతో పేజీలను రూపొందించుకోవచ్చు. వాటిని ఎడిట్ చేయొచ్చు. ఫైళ్లను ఒకే చోట నిర్వహించుకోవచ్చు. అంతేకాదు.. ఇతరులతో కలిసి ఒకే డాక్యుమెంట్‌పై రియల్‌టైమ్‌లో పనిచేయొచ్చు.

ఓపెన్‌ఏఐ ‘DevDay 2026’ సందర్భంగా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. స్పేస్‌ అనేది పేజీలు, అప్‌లోడ్ చేసిన ఫైళ్లు, ఇతర పనులను ఒకే చోట ఉంచుకునే వర్క్ హబ్‌గా పనిచేస్తుంది. ఉదాహరణకు ‘వెబ్‌సైట్‌ లాంచ్‌’ పేరుతో ఓ స్పేస్‌ కావాలని చాట్‌జీపీటీని అడిగితే.. దాన్ని రూపొందించుకోవచ్చు. అందులో అవసరమైన పేజీలు, సబ్‌పేజీలు, ఫైళ్లను జోడించుకోవచ్చు.

ఇందులో ‘ఆల్‌’ ట్యాబ్ ద్వారా సేవ్ చేసిన పనులన్నింటినీ ఒకేసారి చూడొచ్చు. ‘యువర్‌ ఐటెమ్స్‌’లో మన కంటెంట్‌, ‘షేర్డ్‌ విత్‌ యూ’లో ఇతరులు షేర్ చేసిన కంటెంట్‌ను చూడొచ్చు. పేరు ద్వారా కూడా కంటెంట్‌ను వెతకవచ్చు.

రియల్‌టైమ్‌లో కలిసి పని
స్పేస్‌లోని ఒక పేజీని లేదా మొత్తం స్పేస్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసేటప్పుడు వారికి కేవలం చూడటానికి మాత్రమే అనుమతి ఇవ్వాలా.. ఎడిట్ చేసే అవకాశం ఇవ్వాలా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎడిట్ యాక్సెస్ ఉన్నవాళ్లు ఒకే పేజీలో రియల్‌టైమ్‌లో మార్పులు చేయగలరు.

పేరెంట్ పేజీకి ఇచ్చిన యాక్సెస్ దాని సబ్‌పేజీలకు కూడా వర్తిస్తుంది. అవసరమైతే పేరెంట్ పేజీ లేదా స్పేస్‌లోని షేరింగ్ సెట్టింగ్స్ మార్చి ఆ యాక్సెస్‌ను తొలగించవచ్చు.

ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్రో, బిజినెస్‌, ఎంటర్‌ప్రైజ్‌ ప్లాన్‌లకు స్పేస్‌ అందుబాటులో ఉంది. వెబ్‌తో పాటు చాట్‌జీపీటీ డెస్క్‌టాప్ యాప్‌లో పేజీలను రూపొందించడం, ఎడిట్ చేయడం వీలవుతుంది. మొబైల్‌లో పేజీలను చూడటం, షేర్ చేయడం, పేజీల మధ్య నావిగేట్ చేయడం మాత్రమే సాధ్యం. ప్రస్తుతం మొబైల్‌లో పేజీలను ఎడిట్ చేసే అవకాశం లేదు.

మేనేజ్‌డ్ వర్క్‌స్పేస్‌లలో షేరింగ్ ఆప్షన్లు ఆయా సంస్థల సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఎంటర్‌ప్రైజ్‌ వర్క్‌స్పేస్‌లలో అడ్మిన్లు ముందుగా షేరింగ్‌ను ఎనేబుల్ చేయాల్సి రావచ్చు. కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో డేటా రెసిడెన్సీ ఉన్న ఎంటర్‌ప్రైజ్‌, బిజినెస్‌ వర్క్‌స్పేస్‌లకు ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Advertisement
OpenAI
ChatGPT Space
AI collaboration tools
ChatGPT DevDay 2026
Real time document editing
OpenAI workspace hub

More Telugu News