స్వీట్ కంటే నిద్రలేమితోనే షుగర్ ముప్పు ఎక్కువా? నిపుణులు చెబుతున్న నిజం ఇదే..!
- నిద్రలేమితో రక్తంలో చక్కెర నియంత్రణ ప్రభావితం
- నిద్ర తగ్గితే ఇన్సులిన్ సున్నితత్వం తగ్గే ఛాన్స్
- నిద్రలేమితో కార్టిసోల్ స్థాయులు పెరిగే అవకాశం
- ఆకలి పెరగడంతో ఎక్కువగా తినే అవకాశం
- రోజూ ఐదు, ఆరు గంటల నిద్ర అలవాటు మంచిది కాదంటున్న నిపుణులు
రాత్రి భోజనం తర్వాత ఓ చిన్న స్వీట్ తిన్నామంటే చాలు.. ‘షుగర్ పెరిగిపోతుందేమో’ అని చాలామంది భయపడతారు. కానీ రోజూ ఐదు, ఆరు గంటలే నిద్రపోతున్నామంటే మాత్రం అంతగా పట్టించుకోం. నిజానికి రక్తంలో చక్కెర స్థాయుల విషయంలో ఈ రెండు అలవాట్ల ప్రభావం ఒకేలా ఉండదు. ఓ స్వీట్ తిన్న తర్వాత షుగర్ కొంతసేపు పెరగొచ్చు. కానీ, పదే పదే సరిగా నిద్ర సరిగా లేకపోతే మాత్రం శరీరంలో చక్కెర నియంత్రణపై దీర్ఘకాల ప్రభావం చూపొచ్చంటున్నారు నిపుణులు.
నిద్ర తగ్గితే ఏం జరుగుతుంది?
మన శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో నిద్రకు కీలక పాత్ర ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఇన్సులిన్ పనిచేసే తీరు దెబ్బతినొచ్చు. దీంతో రక్తంలో ఉన్న చక్కెరను కణాలు సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు. కొన్ని రోజులు నిద్ర తగ్గినా ఇన్సులిన్‌కు శరీరం స్పందించే విధానం మారుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరగొచ్చు.
ఒత్తిడి హార్మోన్ కూడా కారణమే
నిద్రలేమితో శరీరంలో కార్టిసోల్ స్థాయులు పెరగొచ్చు. ఈ హార్మోన్ కాలేయం నుంచి రక్తంలోకి ఎక్కువ గ్లూకోజ్ విడుదలయ్యేలా చేస్తుంది. అదే సమయంలో ఇన్సులిన్ పనితీరును కూడా ప్రభావితం చేయొచ్చు. నిద్ర సరిగా లేకపోవడంతో శరీరంలోని నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులు కూడా రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రభావం చూపుతాయి.
ఆకలి పెంచే ప్రమాదం
నిద్రకు ఆకలికి కూడా సంబంధం ఉంది. నిద్ర తగ్గినప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఫలితంగా మరుసటి రోజు ఎక్కువ ఆకలిగా అనిపించొచ్చు. ముఖ్యంగా తీపి, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినాలన్న కోరిక పెరగొచ్చు. ఇలా తరచూ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగొచ్చు. దాని ప్రభావం రక్తంలో చక్కెరపైనా పడుతుంది.
ఒక్క స్వీట్.. రోజూ నిద్రలేమి
ఓసారి స్వీట్ తింటే భోజనం తర్వాత రక్తంలో చక్కెర తాత్కాలికంగా పెరగడం సహజం. ఎంత పెరుగుతుందనేది స్వీట్ పరిమాణం, దానిలోని పదార్థాలు, దానితో పాటు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కానీ నిద్రలేమి రోజూ కొనసాగితే ఇన్సులిన్ స్పందన, ఆకలి, కార్టిసోల్ వంటి అనేక అంశాలు పదేపదే ప్రభావితమవుతాయి. అందుకే అప్పుడప్పుడూ తినే ఓ స్వీట్‌ను చూసి భయపడటం కంటే.. రోజూ తక్కువ నిద్రపోయే అలవాటును సరిచేసుకోవడం ముఖ్యమని నిపుణుల సూచనలు చెబుతున్నాయి.
ఎంతసేపు నిద్రపోవాలి?
సాధారణంగా పెద్దలు రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం మంచిది. సమయం మాత్రమే కాదు.. నిద్ర నాణ్యత కూడా ముఖ్యం. తరచూ మెలకువ రావడం, నిద్ర వేళలు మారిపోవడం వంటి సమస్యలు కూడా ప్రభావం చూపొచ్చు. బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం, ఉదయం తలనొప్పి, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.