నా బ్యాట్లు దొంగిలించారు.. మోదీకి చెప్పాలా లేక యోగికా?: దీపక్ చాహర్ ఫన్నీ వీడియో
- టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ బ్యాట్లు చోరీ
- సుమారు రూ. 1.5 లక్షల విలువైన మూడు బ్యాట్లు మాయం
- యోగికి, మోదీకి ఫిర్యాదు చేయాలా అంటూ ఫన్నీ వీడియో
- డబ్బులు అడిగినా ఇచ్చేవాడినంటూ దొంగకు చురకలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాహర్ వీడియో
టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడికి ఎంతో ఇష్టమైన ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా చాహర్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాట్లు పోయాయనే బాధలో ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని అతడు వ్యంగ్యంగా, హాస్యభరితంగా వివరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే, ప్రాక్టీస్ గ్రౌండ్‌లో ఉంచిన దీపక్ చాహర్ బ్యాట్లు అపహరణకు గురయ్యాయి. సుమారు రూ.1.5 లక్షల విలువైన మూడు ప్లేయర్-ఎడిషన్ బ్యాట్లు కనిపించకుండా పోయాయని అతడె వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ఘటన గురించి వివరిస్తీూనే, సదరు దొంగకు తనదైన శైలిలో ఒక విజ్ఞప్తి చేశాడు.
"ఆ బ్యాట్లను దొంగిలించిన వ్యక్తికి బహుశా వాటి అసలు విలువ తెలియకపోవచ్చు. వాటితో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతాడో లేక మరెవరికైనా విక్రయిస్తాడో తెలీదు. అదేదో నేరుగా నా దగ్గరికే వచ్చి డబ్బులు అడిగి ఉంటే ఇచ్చేవాడిని కదా" అంటూ చాహర్ ఆవేదనతో కూడిన హాస్యాన్ని పండించాడు.
అనంతరం తన పరిస్థితిని వివరిస్తూ, "ఇప్పుడు నేను ఏం చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేయాలా? లేక యోగి గారి దగ్గరికో, మోదీ గారి దగ్గరికో వెళ్లాలా? లేదంటే ఆ దేవుడిని వేడుకోవాలా? అదీ కాదంటే మరో రెండు, మూడు బ్యాట్లు పంపమని తయారీ కంపెనీని అడగాలా?" అంటూ తన అయోమయాన్ని సరదాగా పంచుకున్నాడు. తన బ్యాట్లను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ చాహర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.