పోలీసులతో పాలన సాగిస్తున్నారు: బొత్స
Advertisement

పోలీసులతో పాలన సాగిస్తున్నారు: బొత్స

Botsa Satyanarayana says AP government is ruling with the help of police
  • ఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందన్న బొత్స
  • పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యోగుల నిరసనను అణచివేస్తోందని ఆరోపణ
  • వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోందని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన ఖండించారు.

ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను, నిరసనను వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను అణచివేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని, ఉన్నత చదువులు చదివిన వారికి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉద్యోగాలు కల్పించిందని గుర్తుచేశారు.

అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh Secretariat Employees
AP Alliance Government
Crop Loss Compensation
Andhra Pradesh Politics

More Telugu News