రోహిత్ శర్మ అర్ధాంగి ‘సెంటిమెంట్’.. కేబీసీ షోలో ఆసక్తికర విషయం చెప్పిన అమితాబ్
- కేబీసీ షోలో రోహిత్ శర్మపై అభిమానాన్ని చాటుకున్న కంటెస్టెంట్
- రోహిత్ తనకు ఇష్టమైన క్రికెటర్ అని చెప్పిన అమితాబ్ బచ్చన్
- ఆయన ఆడేటప్పుడు అర్ధాంగి రితికా వేళ్లను క్రాస్ చేసుకుంటారని వెల్లడి
- పెళ్లికి ముందు నుంచే రితికాకు ఈ అలవాటు ఉందని ప్రస్తావన
- రితికా సెంటిమెంట్ చాలా మంచిదంటూ బిగ్ బీ ప్రశంస
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ)లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన అర్ధాంగి రితికా సజ్దేకు సంబంధించి అమితాబ్ ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. రోహిత్ ఆడేటప్పుడు రితికా పాటించే ఒక సెంటిమెంట్‌ను ఆయన బయటపెట్టారు.
కేబీసీ 18వ సీజన్‌లో భాగంగా హాట్‌సీట్‌లో ఉన్న సోనాలి అనే కంటెస్టెంట్‌కు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె తాను రోహిత్ శర్మకు వీరాభిమానినని చెప్పారు. "సర్, నేను రోహిత్ శర్మకు పెద్ద ఫ్యాన్. ఆయన్ను కలవడం నా కల. నన్ను నేనే ఆయన భార్యగా భావించుకుంటాను" అని ఆమె అమితాబ్‌తో అన్నారు.
దీనికి అమితాబ్ సరదాగా స్పందిస్తూ.. "మీకు ఆయనంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఈ విషయం తప్పకుండా ఆయనకు చెబుతాం. మీరు ఆయన భార్య కావడానికి వచ్చారని తెలియజేస్తాం" అని నవ్వుతూ అన్నారు.
ఈ సంభాషణ తర్వాత అమితాబ్ బచ్చన్, రోహిత్ శర్మపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. "రోహిత్ మాకు ఎంతో ఇష్టమైన క్రీడాకారులలో ఒకరు. ఆయనంటే మాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు ఆయనతో మాట్లాడాను. ఆయన ఆడేటప్పుడు మేము తప్పకుండా చూస్తాం" అని తెలిపారు.
అదే సమయంలో రితికా సజ్దేకు సంబంధించిన ఒక ప్రత్యేక విషయాన్ని ఆయన వెల్లడించారు. "అయితే, స్టేడియంలో మేం ఆయన భార్య వైపు చూస్తుంటాం. ఎందుకంటే, రోహిత్ ఆడుతున్నంత సేపు ఆమె తన చేతి వేళ్లను క్రాస్ (fingers crossed) చేసుకొని ఉంటారు.
ఈ విషయం మాకు ఆశ్చర్యం కలిగించడంతో, దీని గురించి ఆమెను అడిగాను. పెళ్లికి ముందు నుంచే, రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ తాను అలా వేళ్లను క్రాస్ చేసుకొని ఉంటానని ఆమె చెప్పారు. ఇది చాలా మంచి విషయం అనిపించింది" అని అమితాబ్ వివరించారు.
ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 18 సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమవుతోంది. ఇదే ఛానెల్‌లో రోహిత్ శర్మ కూడా ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.