మొసళ్లు ఆహారంతో పాటు రాళ్లను ఎందుకు మింగుతాయి? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మొసళ్లు ఆహారంతో పాటు రాళ్లను ఎందుకు మింగుతాయి? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Why do crocodiles swallow stones along with food the reason will surprise you
  • ఆహారంతో పాటు చిన్న రాళ్లను మింగే మొసళ్లు
  • ఈ రాళ్లను గ్యాస్ట్రోలిత్స్‌గా పిలుస్తారని శాస్త్రవేత్తల వెల్లడి
  • రాళ్లు కడుపులో ఆహారాన్ని చిన్నదిగా చేయడంలో సహాయపడొచ్చంటున్న శాస్త్రేవత్తలు
  • రాళ్లు, కడుపులోని ఆమ్లాలు కలిసి జీర్ణక్రియకు తోడ్పడతాయని అంచనా
  • నీటిలో శరీర స్థిరత్వానికీ రాళ్లు ఉపయోగపడొచ్చని వివరణ
మొసలి వేటాడటం మీరు చూసే ఉంటారు. దొరికిన ఆహారాన్ని పెద్ద ముక్కలుగా కొరికి మింగేస్తుంది. అయితే ఎప్పుడైనా మొసలి ఆహారంతో పాటు చిన్న రాళ్లను కూడా మింగడం గమనించారా? అసలు అవి అలా ఎందుకు చేస్తాయి? కేవలం పొరపాటున మింగేస్తున్నాయా? లేక దాని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? శాస్త్రవేత్తలు దీనికి కొన్ని ఆసక్తికరమైన కారణాలను చెబుతున్నారు.

రాళ్లకు ప్రత్యేక పేరుంది..
మొసళ్లు మింగే చిన్న రాళ్లను గ్యాస్ట్రోలిత్స్‌ అంటారు. ఇవి కడుపులోనే ఉండిపోతాయి. మొసళ్లు మనుషుల్లా ఆహారాన్ని పూర్తిగా నమలవు. పెద్ద మాంసం ముక్కలతో పాటు ఎముకలు, గట్టి భాగాలను కూడా అలాగే మింగేస్తాయి. ఇక్కడే ఈ రాళ్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

కడుపులో ఆహారాన్ని మెత్తగా చేస్తాయి
మొసలి జీర్ణాశయం ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో బాగా కదులుతుంది. ఆ సమయంలో కడుపులో ఉన్న రాళ్లు ఆహారంతో కలిసిపోతాయి. ఇవి ఒక రకంగా సహజమైన గ్రైండర్‌లా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో మింగిన ఆహారం చిన్న ముక్కలుగా మారి జీర్ణక్రియ సులభం కావచ్చు.

కేవలం రాళ్ల వల్లే జీర్ణం కాదు..
ఆహారాన్ని జీర్ణం చేయడంలో రాళ్లు మాత్రమే కీలకం కాదు. మొసళ్ల కడుపులో చాలా బలమైన ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మాంసాన్ని విచ్ఛిన్నం చేయడంతో పాటు ఆహారంతో పాటు మింగిన ఎముకలు, ఇతర గట్టి పదార్థాలను కూడా కరిగించడంలో సహాయపడతాయి. అంటే రాళ్లు యాంత్రికంగా ఆహారాన్ని చిన్నదిగా చేస్తే.. కడుపులోని ఆమ్లాలు రసాయనికంగా దాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

నీటిలో తేలే విధానంలోనూ ఉపయోగమా?
మొసళ్ల కడుపులో రాళ్లు ఉండటానికి మరో కారణం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కడుపులో అదనపు బరువు ఉండటం వల్ల నీటిలో శరీర స్థానం, తేలే విధానంపై ప్రభావం ఉండొచ్చు. దీంతో నీటిలో ఈదేటప్పుడు లేదా ఎక్కువసేపు నీటిలో ఉన్నప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడంలో కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంది.
Advertisement
Crocodiles
Gastroliths
Crocodile digestion
Why crocodiles swallow stones
Reptile biology
Animal behavior facts

More Telugu News