వరదనీటిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

వరదనీటిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

MLA Kuna Ravi Kumar Collector and SP swept away in floods rescued by NDRF
  • వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు
  • వరద పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ
  • వరదలో చిక్కుకున్న గర్భిణీని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాయుగుండం దాటికి ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆకస్మిక వరదలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితులను సమీక్షించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు.


వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఎస్పీలు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఆకస్మిక పరిణామంతో అక్కడున్న వారంతా తీవ్ర తీవ్ర భయాందోళనకు గురికాగా, వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించాయి. లైఫ్ బోట్లలో వెళ్లి కొట్టుకుపోతున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలను అత్యంత సాహసోపేతంగా రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.


మరోవైపు, పార్వతీపురం మన్యం జిల్లాలో వరద ముంపులో చిక్కుకున్న 9 నెలల గర్భిణీ భూమికను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లైఫ్ జాకెట్ తొడిగి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Kuna Ravi Kumar
Srikakulam Floods
NDRF Rescue Operation
Andhra Pradesh Rains
Srikakulam Collector and SP
TDP MLA

More Telugu News