డేటా సెంటర్లకు ఏపీ కొత్త విధానం.. 70 శాతం గ్రీన్ ఎనర్జీ తప్పనిసరి: నారా లోకేశ్
- విశాఖలో డేటా సెంటర్ల కోసం పోలవరం జలాల వినియోగం
- ఏపీలో 23 రంగాల వారీగా ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు
- అమరావతిలో క్వాంటం టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధి
- 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
రాష్ట్రంలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లు పర్యావరణ హితంగా ఉండేలా సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్‌లో కనీసం 70 శాతం సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేశామని ఆయన తెలిపారు.
గురువారం ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (PAFI) నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ క్లస్టర్ నీటి అవసరాల కోసం పోలవరం ఎడమగట్టు కాలువ ద్వారా నీటిని తరలిస్తున్నామని చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని విశాఖకు మళ్లించి డేటా సెంటర్ల అవసరాలు తీరుస్తామన్నారు. నీటి శుద్ధి ప్లాంట్ల (desalination plants) ఏర్పాటుకు కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటికే ఒక సంస్థ ఈ దిశగా ముందుకొచ్చిందని వెల్లడించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన లక్ష్యంగా 23 రంగాల వారీగా ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సిమెంట్, ఆటోమొబైల్ వంటి సంప్రదాయ తయారీ రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రేర్ ఎర్త్ మినరల్స్, బయోమెడికల్, ఫార్మా వంటి ఆధునిక రంగాలకు కూడా ఈ క్లస్టర్లలో చోటు కల్పించామన్నారు. ఏపీలో గూగుల్ భారీ పెట్టుబడి పెడుతోందని, దీని స్ఫూర్తితో మరిన్ని కంపెనీలు డేటా సెంటర్ల రంగంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
అమరావతి కేంద్రంగా క్వాంటం టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఐబీఎం నుంచి 150-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. ఈ సాంకేతికతకు అవసరమైన క్రయోజెనిక్స్, మెటీరియల్ సైన్సెస్ వంటి అనుబంధ రంగాలనూ అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లోనూ రాణించాల్సి ఉంటుందన్నారు. క్వాంటం టెక్నాలజీ ఎంత ముఖ్యమో, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అక్టోబర్ 2న దాదాపు రూ.1 లక్ష కోట్లతో హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభిస్తున్నామని, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తరహాలో "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్"ను ఏర్పాటు చేసి వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు.