మంత్రి ఫరూక్ సమక్షంలో నంద్యాలలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

మంత్రి ఫరూక్ సమక్షంలో నంద్యాలలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

NMD Farooq welcomes massive joinings from YSRCP to TDP in Nandyal
  • ఫరూక్ సమక్షంలో టీడీపీలో చేరిన 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామన్న నేతలు
  • ఇటీవలే టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను

ఏపీలో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పలు చోట్ల కేడర్ పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా, నంద్యాల నియోజకవర్గంలో నేతలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.


నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సమక్షంలో మాజీ సర్పంచ్ ఎల్లయ్యతో పాటు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు వెల్లడించారు.


మరోవైపు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన అనుచరులు పలువురు కూడా సైకిల్ ఎక్కేశారు. రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైసీపీని వీడే నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
NMD Farooq
TDP Nandyal joinings
YSRCP to TDP switch
Andhra Pradesh local elections
Chandrababu Naidu welfare programs
Nandyal politics

More Telugu News