తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

Telangana
Advertisement
  • బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం
  • తెలంగాణలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు అంచనా
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అధికారులు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Advertisement

సంబంధిత వార్తలు

Telangana RainsBay of Bengal DepressionIMD HyderabadOrange Alert TelanganaHeavy Rain Forecast

More Telugu News

ఏపీలో డిసెంబర్ పింఛన్లు ముందుగానే.. కారణం ఇదే!

22 Nov, 17:15

ముక్త్ నషా ఈవెంట్ కు ప్రభాస్ ను ఆహ్వానించిన కిషన్ రెడ్డి.. ప్రత్యేక టీషర్ట్‌ల ఆవిష్కరణ

22 Nov, 17:02

కాల్పుల ఘటన తర్వాత తొలిసారిగా బయటికొచ్చిన టైగర్ ష్రాఫ్

22 Nov, 16:54

జర్మనీలో నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు: నారా లోకేశ్

22 Nov, 16:47

25 కేజీలు కాకుండా 26 కేజీల బియ్యం బస్తాల వెనుక ఉన్న అసలు కారణమిదే!

22 Nov, 16:47

అల్లు సినిమాస్‌లో టికెట్లు బ్లాక్..? వెంటనే స్పందించిన అల్లు అరవింద్

22 Nov, 16:28

దోహాలో భారత్ ఎ, పాక్ ఎ జట్ల సమరం.. టాస్ సమయంలో గందరగోళం.. వీడియో ఇదిగో!

22 Nov, 16:20

15 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టి 3బీహెచ్‌కే ఫ్లాట్ కొన్న ఐటీ ఉద్యోగిని కథ!

22 Nov, 16:06

భారత పాస్‌పోర్ట్‌తో ఇప్పుడు ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చో తెలుసా?

22 Nov, 15:54

నైట్ షిఫ్ట్ చేసేవారికి హెచ్చరిక.. గుండె నిర్మాణమే మారిపోతుందని అధ్యయనంలో వెల్లడి

22 Nov, 15:46

మరింత క్వాలిటీ కోసం.. రష్మిక మందన్న 'మైసా' విడుదల వాయిదా

22 Nov, 15:37

పంచాయతీ ఎన్నికల్లో పంతాలకు పోవద్దు: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

22 Nov, 15:22

బంగారం కంటే అయోధ్య భూములే మేలా.. ఎందులో ఎక్కువ లాభాలు?

22 Nov, 15:12

ఒప్పందం కంటే ముందే ప్రాజెక్టు పూర్తి.. అయినా కెనడా బిల్డర్ కు ఎదురుదెబ్బ.. ఎందుకంటే..!

22 Nov, 15:00

తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్!

22 Nov, 14:48
..More Telugu News