విద్యార్థినిపై వేధింపులు.. ఇలాంటివి జరుగుతుంటాయన్న బిహార్ మంత్రి!

విద్యార్థినిపై వేధింపులు.. ఇలాంటివి జరుగుతుంటాయన్న బిహార్ మంత్రి!

Shravan Kumar Bihar Minister says such small incidents happen on Jamui girl harassment case
  • జమయి జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు
  • మంత్రి శ్రావణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, సిట్ ఏర్పాటు
  • ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్
బిహార్‌లోని జముయి జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దారుణంపై బిహార్ మంత్రి శ్రావణ్ కుమార్ "ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి" అని చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా, ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సెప్టెంబరు 19వ తేదీ సాయంత్రం జముయి జిల్లాలో కోచింగ్ క్లాసుల నుంచి స్కూటర్‌పై సహ విద్యార్థితో కలిసి ఇంటికి తిరిగి వస్తున్న 10వ అమ్మాయిని కొందరు యువకులు అడ్డగించారు. అబ్బాయిపై దాడి చేసి, ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నా వదలకుండా అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం (21న) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసి, మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పాటైంది. ఈ ఘటనపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. "ప్రపంచం నేరరహితం కాదు. ఇలాంటి చిన్న ఘటనలు జరుగుతుంటాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిందితులు తప్పించుకోలేరు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వీడియోపై స్పందిస్తూ "తీవ్ర ఆందోళనకరం" అని పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటలకు కూడా ఒక అమ్మాయికి భద్రత లేదా అని ప్రశ్నించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. "మాకు సిగ్గుగా ఉంది, కానీ ప్రభుత్వానికి సిగ్గులేదు" అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో "గుండా రాజ్" నడుస్తోందని, సీఎం సమ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
Advertisement
Shravan Kumar
Jamui Girl Harassment
Bihar Minister Controversial Remarks
Rahul Gandhi
Tejashwi Yadav
Bihar Crime News

More Telugu News