పవిత్ర బంధానికే మచ్చ?.. రాఖీ కట్టిన వ్యక్తితోనే మహిళ పరారీ!
- భర్త స్నేహితుడితో పరారైన వివాహిత
- పారిపోయే ముందు మూడేళ్ల పాటు అతనికి రాఖీ కట్టిన వైనం
- ఉత్తరప్రదేశ్‌లోని ఈసానగర్‌లో జరిగిన ఘటన
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. పవిత్రమైన అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా భావించే రాఖీ కట్టిన వ్యక్తితోనే ఓ మహిళ పరారు కావడం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈసానగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త స్నేహితుడిని సొంత అన్నలా భావించింది. వరుసగా మూడేళ్ల పాటు అతడికి రాఖీ కడుతూ వచ్చింది. అయితే, నాలుగో ఏడాది అందరికీ షాకిస్తూ, ఆమె అదే వ్యక్తితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. భర్తకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడినే 'అన్న' అని పిలుస్తూ, రాఖీ కట్టిన మహిళ ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఇంత అపహాస్యం చేయడం సరికాదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. మహిళ కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించలేదు.