'వకీల్ సాబ్' సీక్రెట్ రివీల్.. పవన్‌పై దిల్ రాజు ప్రశంసలు

'వకీల్ సాబ్' సీక్రెట్ రివీల్.. పవన్‌పై దిల్ రాజు ప్రశంసలు

  • తన కోసం పవన్ కల్యాణ్ రూ.5 కోట్లు వదులుకున్నారన్న దిల్ రాజు
  • 'వకీల్ సాబ్' సమయంలో నిర్మాతలను ఆదుకున్న పవర్ స్టార్
  • కరోనా సెకండ్ వేవ్ నష్టాల కారణంగా పవన్ నిర్ణయం
  • నిర్మాతను ఆదుకునే గొప్ప గుణం పవన్‌ది అని ప్రశంస
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో పవన్ తన కోసం రూ. 5 కోట్ల రెమ్యునరేషన్‌ను వదులుకున్నారని తెలిపారు.

‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉందని, థియేటర్లలో ఆంక్షల వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, తనకు ఇంకా రావలసిన రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని వివరించారు.

"పరిస్థితిని అర్ధం చేసుకుని, నిర్మాత నష్టపోకూడదని ఆదుకునే గొప్ప గుణం పవన్‌ది..దటీజ్ పవర్ స్టార్" అని దిల్ రాజు వేదికపైనే ప్రశంసించారు. నిర్మాతను ఆదుకునే విషయంలో పవన్ చూపిన చొరవను ఆయన కొనియాడారు.  
Advertisement

More Telugu News