రూ. కోటి కోసం కిడ్నాప్.. బాలుడిని చంపి డిక్కీలో కుక్కి.. ప్రమాదంతో దొరికిన టెక్కీ!
- బెంగళూరులో వరుస ప్రమాదాలతో బయటపడిన హత్యోదంతం
- కారు డిక్కీలో 13 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం
- కోటి రూపాయల కోసం పక్కింటి యువకుడే దారుణం
- నిందితుడు యూకే రిటర్న్డ్ టెక్కీ భాస్కర్ రెడ్డి అరెస్ట్
- మద్యం మత్తులో ప్రమాదాలు చేయడంతో పట్టుబడిన కిల్లర్
బెంగళూరులో జరిగిన వరుస కారు ప్రమాదాలు ఓ కిడ్నాప్, హత్య కేసును వెలుగులోకి తెచ్చాయి. యెలహంక సమీపంలో గురువారం రాత్రి ఓ కారు పలు వాహనాలను ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు తనిఖీ చేయగా, కారు డిక్కీలో 13 ఏళ్ల బాలుడి మృతదేహం కనిపించింది.
యెలహంక వినాయకనగర్‌కు చెందిన భాస్కర్ రెడ్డి (28), తన పక్కింట్లో ఉండే ప్రజ్వల్ (13) అనే బాలుడిని టార్గెట్ చేశాడు. గణేశ్ నిమజ్జనం కోసం బాణసంచా కొందామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం బాలుడి కుటుంబం నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశాడు. అయితే, బాలుడు ప్రతిఘటించి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో, సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి హత్య చేశాడు.
నిందితుడు భాస్కర్‌రెడ్డి యూకేలో ఎం.టెక్ పూర్తి చేసి ఇటీవలే తిరిగి వచ్చాడు. అతడి కుటుంబానికి సుమారు రూ.3 కోట్ల అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చేందుకే ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి పారేయాలని భావించాడు. ఈ నేరంలో అతడికి ఏడుకొండలు అనే మరో వ్యక్తి సహకరించాడని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం మద్యం తాగిన భాస్కర్‌రెడ్డి, కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయాడు. మార్గమధ్యంలో పలు వాహనాలను ఢీకొట్టి, చివరకు ఓ గోడకు ఢీకొట్టడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కారును తనిఖీ చేశారు. డిక్కీలో బాలుడి శవాన్ని చూసి షాక్ అయ్యారు. తొలుత ప్రమాదంలో బాలుడు చనిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని నిందితుడు నాటకమాడినా, ఆ తర్వాత అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.
ఈ ఘటనపై యెలహంక పరిధిలోని చిక్కజాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి, ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఏడుకొండలు కోసం గాలిస్తున్నారు.