మోదీకి రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష
- మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు
- అఖిలేశ్, మాయావతి కూడా విషెస్
- శరద్ పవార్, ప్రియాంక చతుర్వేది శుభాకాంక్షలు
- విజయ్, స్టాలిన్ అభినందనలు
- బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆరోగ్యంగా, సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీకి శుభాకాంక్షలు చెబుతూ.. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం, సంతోషంతో సుదీర్ఘ జీవితం గడపాలని ఆకాంక్షించారు.
మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ గురువారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో నెల రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7తో మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తవుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 9న ప్రకటించారు.
2014 నుంచి కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాల్లో మోదీ కీలకంగా వ్యవహరించారు.