భారత్‌పై అమెరికా 100 శాతం సుంకాల ముప్పు.. మోదీ సర్కార్ ఏమందంటే..!
- రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించే దిశగా అమెరికాలో బిల్లు
- రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో భారత్, చైనా
- బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే భారత్‌పై 100 శాతం సుంకాలు
- దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటామని భారత్ స్పష్టీకరణ
- దేశ ఇంధన అవసరాల విషయంలో రాజీ ఉండదని వెల్లడి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
‘సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన విషయాన్ని గమనిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పరిణామంపై తదుపరి చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ నేపథ్యంలో కొత్త చట్టం భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతయ్యే ఏ వస్తువులపై ఎంత సుంకం విధిస్తుంది? ఏ ఉత్పత్తులకు వర్తిస్తుంది? ఎప్పటి నుంచి అమలు చేస్తుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామని పేర్కొంది.
ఇటీవల అమెరికా అధికారులతో జరిగిన పలు ఉన్నతస్థాయి చర్చల్లో రష్యా చమురు కొనుగోళ్ల అంశాన్ని భారత్ ప్రస్తావించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై చూపే ప్రభావాన్ని కూడా అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
‘సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ను అమెరికా సెనేట్ గత నెల ఆమోదించింది. బుధవారం ప్రతినిధుల సభలో 262-159 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది.
రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చైనా, భారత్ సహా పలు దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం ఈ చట్టం ద్వారా అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది.
అమెరికా నుంచి వచ్చే తుది సుంకాల రేటు, ఏయే ఉత్పత్తులకు వర్తిస్తుందన్న వివరాలు వెల్లడైన తర్వాతే భారత్‌పై అసలు ప్రభావం ఎంత ఉంటుందో స్పష్టమవుతుంది.