ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు భారీ ఊరట.. 892 పోస్టుల భర్తీ.. గ్రూప్-1 సహా నోటిఫికేషన్ల విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు భారీ ఊరట.. 892 పోస్టుల భర్తీ.. గ్రూప్-1 సహా నోటిఫికేషన్ల విడుదల!

APPSC releases notifications for 892 posts including Group 1 in Andhra Pradesh
  • గ్రూప్-1లో 163 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • 11 డిప్యూటీ కలెక్టర్లు, 36 డీఎస్పీ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగార్థులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని 20 విభిన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 892 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే కీలకమైన గ్రూప్-1 సర్వీసులలో 163 పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు నిబంధనలు పరిశీలించి అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


నోటిఫికేషన్ల ప్రకారం పోస్టుల వివరాలు:

గ్రూప్-1 సర్వీసులు (163 పోస్టులు): 11 డిప్యూటీ కలెక్టర్లు, 36 డీఎస్పీ (సివిల్), 3డీఎస్పీ (కమ్యూనికేషన్స్), 14 టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 35 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (DDO), 15 డిప్యూటీ రిజిస్ట్రార్లు, 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, 14 డిస్ట్రిక్ట్/డివిజనల్ ఫైర్ ఆఫీసర్లు, 14 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ల పోస్టులతో పాటు ఇతర ఉన్నత పోస్టులు ఉన్నాయి.


ఇతర ముఖ్య శాఖల్లో ఖాళీలు: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు (196), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (73), హార్టికల్చర్ ఆఫీసర్లు (37), పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్-2 (18), ఏపీ అసెంబ్లీ రిపోర్టర్లు (11), ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర పోస్టులు భర్తీ కానున్నాయి.


దరఖాస్తు గడువు .. ముఖ్య సమాచారం:
గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6 నుండి ప్రారంభమై అక్టోబర్ 27 వరకు కొనసాగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిబంధనలు, విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని గడువులోగా అప్లై చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

Advertisement
APPSC
APPSC Group 1 Notification
Andhra Pradesh Government Jobs
APPSC Recruitment 2024
AP Group 1 Vacancies
APPSC Job Notifications

More Telugu News