భారత్‌లో పేరు లేని రైల్వే స్టేషన్‌ ఎక్కడుందో తెలుసా?.. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?

భారత్‌లో పేరు లేని రైల్వే స్టేషన్‌ ఎక్కడుందో తెలుసా?.. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?

Only nameless railway station in India why did that situation arise
  • పశ్చిమ బెంగాల్‌లో పేరు లేని రైల్వే స్టేషన్‌
  • బంకురా జిల్లాలో రైనానగర్‌ స్టేషన్‌ ఉంది
  • రైనా, రైనానగర్‌ గ్రామాల మధ్య పేరుపై వివాదం
  • 2008లో బ్రాడ్‌గేజ్‌ మార్గంతో మొదలైన వివాదం
  • రెండు గ్రామాల పంచాయతీతో ఖాళీగా బోర్డులు
దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు ఓ పేరు ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు మాత్రం ప్లాట్‌ఫామ్‌పై పేరు కనిపించదు. పసుపు రంగు బోర్డులు ఉంటాయి. కానీ వాటిపై అక్షరం కూడా ఉండదు. ఇంతకీ ఆ స్టేషన్‌ ఎక్కడుంది? పేరు ఎందుకు లేకుండా పోయింది?

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఈ విచిత్ర రైల్వే స్టేషన్‌ ఉంది. బర్ధమాన్‌ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బంకురా-మసాగ్రామ్‌ బ్రాడ్‌గేజ్‌ మార్గంలో ఉన్న ఈ స్టేషన్‌లో రోజూ ఆరు రైళ్లు ఆగుతాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం ఈ స్టేషన్‌ నుంచే ప్రయాణిస్తుంటారు.

అయితే స్టేషన్‌ బోర్డులపై పేరు మాత్రం కనిపించదు. దీనికి కారణం రెండు గ్రామాల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న వివాదం. ఒకటి రైనా గ్రామం. మరోటి రైనానగర్‌. పాత నేరో గేజ్‌ మార్గం ఉన్నప్పుడు ఈ స్టేషన్‌ను రైనానగర్‌ పేరుతో పిలిచేవారు.

2008లో కొత్త బ్రాడ్‌గేజ్‌ మార్గం నిర్మించినప్పుడు స్టేషన్‌ భవనాన్ని రైనా గ్రామానికి చెందిన భూమిలో నిర్మించారు. దీంతో స్టేషన్‌కు తమ గ్రామం పేరు పెట్టాలని రైనా గ్రామస్థులు కోరారు. పాత పేరు కొనసాగించాలని రైనానగర్‌ వాసులు పట్టుబట్టారు. ఈ వివాదం రైల్వే బోర్డు, కోర్టుల వరకు వెళ్లింది.

రెండు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో రైల్వే అధికారులు మధ్యేమార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఏ గ్రామం పేరూ పెట్టకుండా ఖాళీ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో స్టేషన్‌ పేరు లేకుండానే రైళ్లు ఆగుతున్నాయి. కొత్తగా వచ్చే ప్రయాణికులు స్టేషన్‌ను గుర్తించేందుకు స్థానికులను అడగాల్సి వస్తోంది.

అయితే అధికారిక రైల్వే రికార్డుల్లో మాత్రం ఈ స్టేషన్‌ పూర్తిగా పేరు లేనిది కాదు. ఇప్పటికీ రైనానగర్‌ (ఆర్‌ఎన్‌జీఆర్‌) పేరుతోనే గుర్తిస్తున్నారు. టికెట్లు కూడా అదే పేరుతో జారీ అవుతున్నాయి. కానీ స్టేషన్‌ ప్రాంగణంలోని బోర్డులపై మాత్రం పేరు కనిపించదు.
Advertisement
Rainanagar Railway Station
Nameless Railway Station India
West Bengal Bankura
Indian Railways
Raina Village Dispute
Indian Railway Station without name

More Telugu News