రూ.2 కోట్లతో తీస్తే రూ.200 కోట్లు కురిపించింది.. ఇప్పుడు తెలుగులోకి.. రేపే టీజర్

రూ.2 కోట్లతో తీస్తే రూ.200 కోట్లు కురిపించింది.. ఇప్పుడు తెలుగులోకి.. రేపే టీజర్

Hanuman Ansh movie made with 2 crores earned 200 crores now coming to Telugu teaser tomorrow
  • హిందీలో సంచలనం సృష్టించిన 'హనుమాన్ అంశ్' తెలుగులో విడుదల
  • మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణ
  • రేపు ఉదయం 11 గంటలకు తెలుగు టీజర్‌ను విడుదల చేయనున్న చిత్రబృందం
  • సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలోకి రానున్న సినిమా
జాతీయ స్థాయిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. 'హనుమాన్ అంశ్ - ఆంజనేయుడి అవతారం' పేరుతో రానున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ను రేపు (సెప్టెంబరు 14) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తుండటం విశేషం. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ ఈ సినిమాను సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, రేపు టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ చిత్రం ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (మహరాజ్‌జీ) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా, శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. హిందీలో కేవలం రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, అనూహ్యంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమా విజయం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రచారానికి తగినంత డబ్బు లేకపోవడంతో, చిత్ర బృందం వినూత్నంగా ఆలోచించి దేశవ్యాప్తంగా 8 చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. సినిమా, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇప్పుడు త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుడి సమర్పణలో తెలుగులోకి వస్తుండటంతో 'హనుమాన్ అంశ్'పై ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
Advertisement
Hanuman Ansh
Neem Karoli Baba
Trivikram Srinivas
Sobhinav Satya
Hanuman Ansh Telugu Teaser
Fortune 4 Cinemas

More Telugu News