మహిళల ఆసియా కప్ ఫైనల్.. లంకపై టాస్ గెలిచిన భారత్
- మహిళల ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- భారత తుది జట్టులో ఒక మార్పు.. ప్రతీక స్థానంలో కమలినికి చోటు
- టాస్ గెలిస్తే బౌలింగ్ చేసేవాళ్లమని తెలిపిన శ్రీలంక కెప్టెన్ చామరి
- ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలవాలని చూస్తున్న భారత జట్టు
- టోర్నీలో ఇప్పటివరకు అపజయం ఎరుగని భారత్, శ్రీలంక జట్లు
- దుబాయ్ వేదికగా జరుగుతున్న టోర్నీ
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శ్రీలంకతో జరుగుతున్న ఈ టైటిల్ పోరులో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా విజయాలతో దూసుకెళుతున్న ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కీలకమైన ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేశారు. ఈ టోర్నీలో తొలిసారిగా తుది జట్టు కూర్పును మార్చిన భారత్, ప్రతీక రావల్ స్థానంలో జి.కమలినికి అవకాశం కల్పించింది. కమలినికి ఈ టోర్నమెంట్‌లో ఇది తొలి మ్యాచ్ కాగా, తన కెరీర్‌లో రెండో టీ20 మ్యాచ్.
ఈ టోర్నీలో ఇరు జట్లూ అపజయం ఎరుగకుండా ఫైనల్ చేరినప్పటికీ, శ్రీలంకతో పోలిస్తే భారత జట్టే అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. భారత బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధన పరుగుల వరద పారిస్తుండగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ (11 వికెట్లు), శ్రీ చరణి (8 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు, శ్రీలంక బ్యాటింగ్ విభాగంలో తడబడుతోంది. కెప్టెన్ చమరి అటపట్టుతో సహా టాపార్డర్ బ్యాటర్లు ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
భారత్ ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్ గెలిచి, రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. శ్రీలంకపై టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. గత 10 టీ20 మ్యాచ్‌లలో 9 గెలిచింది. అయితే, 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలోనే భారత్ ఓటమి పాలవడం గమనార్హం.
టాస్ గెలిచిన అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. "ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై పరుగులు ఉంచడం ఎప్పుడూ సానుకూలాంశం. ఫైనల్ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడిని అధిగమించడానికి ఇది సరైన నిర్ణయం. ప్రతీక స్థానంలో కమలిని ఆడుతోంది. ఆమె ప్రతిభావంతురాలు" అని తెలిపింది.
శ్రీలంక కెప్టెన్ అటపట్టు మాట్లాడుతూ.. "మేము టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. మా బౌలర్లపై మాకు నమ్మకం ఉంది. తొలి ఆరు ఓవర్లు చాలా కీలకం. ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తాం" అని వ్యాఖ్యానించింది. శ్రీలంక కూడా తమ జట్టులో సంజన కవిండి స్థానంలో విష్మి గుణరత్నెకు చోటు కల్పించింది.
తుది జట్ల వివరాలు:
భారత్: స్మృతి మంధన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతి ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), గుణలన్ కమలిని, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందని శర్మ.
శ్రీలంక: చామరి అథాపత్తు(కెప్టెన్), ఇమేషా దులని, విష్మి గుణరత్నె, హసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నిలక్షిక సిల్వా, కౌషాని నుత్యంగన(వికెట్ కీపర్), సుగంధిక కుమారి, చముది ప్రభోద, మితాలి అయోధ్య.